విజయవాడలోని ఓ హోటల్ గదిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ప్రేమికురాలు అక్కడిక్కడే మృతి చెందగా, ప్రేమికుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
వివరాల్లోకి వెళితే ఓ ప్రైవేట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న గౌతమి అనే యువతి, గుడివాడ పట్టణానికి చెందిన లోకేష్ అనే యువకుడు గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు.పని నిమిత్తం వచ్చామని చెప్పి విజయవాడలోని గాంధీ నగర్ లో ఉన్నటువంటి ఓ హోటల్ లో ఒక రూముని అద్దెకు తీసుకున్నారు.
అయితే వీళ్ళు ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది గది తలుపులు పగులగొట్టగా ప్రేమికులు ఇద్దరు విషం తాగి ఆత్మహత్య చేసుకుని విగతజీవులుగా పడి ఉన్న దృశ్యాన్ని చూశారు. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం వీరిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా గౌతమి అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు.
అలాగే ప్రియుడు లోకేష్ అపస్మారక స్థితిలో ఉంటూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
దీంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.సమాచాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇందులో భాగంగా ఇద్దరి ప్రేమికుల తండ్రి తల్లిదండ్రులను విచారిస్తున్నారు.
అయితే ఆ ప్రేమికులు ఆత్మహత్యకి పాల్పడడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.