Love Today movie Review : లవ్ టుడే రివ్యూ: యువతకు కనెక్ట్ అయిన లవ్ టుడే!

ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాకు దర్శకుడుగా బాధ్యతలు చేపట్టడమే కాకుండా హీరోగా కూడా నటించాడు.

ఇక ఈ సినిమా తమిళంలో మంచి సక్సెస్ అందుకోగా ఈ రోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాను డబ్బింగ్ రూపంలో దిల్ రాజ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.ఇక ఇందులో ఇవానా హీరోయిన్ గా నటించింది.

అంతేకాకుండా రవీ నారవీ, యోగి బాబు, సత్యరాజ్ తదితరులు నటించారు.ఇక ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.

కథ:

కథ విషయానికి వస్తే ఇందులో ప్రదీప్ రంగనాథన్ ప్రదీప్ పాత్రలో నటించగా అతడు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు.ఇక నికిత (ఇవానా) కూడా మరో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటుంది.

Advertisement

అయితే వీరికి ఒకచోట పరిచయం పెరగటంతో ఇద్దరు ప్రేమలు పడతారు.అదే సమయంలో ప్రదీప్ అక్క దివ్య (రవీనారవి) కు యోగి (యోగి బాబు) అనే డాక్టర్ తో పెళ్లి కుదురుతుంది.

ప్రదీప్ తన అక్క పెళ్లి తర్వాత తన ప్రేమ విషయం గురించి నికిత వాళ్ళ ఇంట్లో చెప్పాలని అనుకుంటాడు.కానీ అంతలోపే నికిత తండ్రి వేణు శాస్త్రి (సత్యరాజ్)కి తెలియటంతో వెంటనే వేణు శాస్త్రి ప్రదీప్ ని పిలిచి మాట్లాడుతాడు.

అంతేకాకుండా ఎటువంటి గొడవలు చేయకుండా వారి పెళ్లికి ఒప్పుకుంటాడు.కానీ ఒక కండిషన్ మాత్రం పెడతాడు.

అదేంటంటే ఒకరి ఫోన్ మరొకరు తీసుకొని ఒక రోజంతా వాడాలి అని చెప్పటంతో వాళ్ళిద్దరూ సరే అంటారు.ఆ తర్వాత ఫోన్లు మార్చుకున్న వారికి ఎటువంటి సంఘటనలు ఎదురవుతాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

వారిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా.చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథలోనిది.

Advertisement

నటినటుల నటన:

దర్శకుడుగానే కాకుండా నటుడుగా కూడా ప్రదీప్ రంగనాథన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.చాలా న్యాచురల్ గా కనిపించాడు.ఒక ప్రేమికుడి పాత్రలో అద్భుతంగా నటించాడు.

ఎమోషనల్ సన్నివేశాలలో మాత్రం అద్భుతంగా నటించాడు.హీరోయిన్ ఇవానా కూడా అద్భుతంగా నటించింది.

తను కూడా ఎమోషనల్ సీన్స్ లో బాగా ఆకట్టుకుంది.మిగతా నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:

ఇక దర్శకుడు ప్రదీప్ ఈ సినిమాతో ప్రేక్షకులకు మంచి కథను పరిచయం చేశాడు.యువన్ శంకర్ రాజా అందించిన నేపథ్య సంగీతం బాగా ఆకట్టుకుంది.

డైలాగ్స్ కూడా బాగున్నాయి.ఇది మిగతా టెక్నికల్ విభాగాలు బాగా పనిచేశాయి.

విశ్లేషణ:

దర్శకుడు ఈ సినిమాను రొటీన్ ప్రేమ కథగా కాకుండా కాస్త కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేశాడు.ముఖ్యంగా ఈ తరం ప్రేమికులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది.ఒక ఫోన్ ద్వారా కథను మలుపు తిప్పేలా చేశాడు డైరెక్టర్.

ప్లస్ పాయింట్స్:

కథ, నటీనటుల నటన, సంగీతం, కామెడీ.

మైనస్ పాయింట్స్

: కొన్ని సన్నివేశాలు బాగా సాగదీసినట్లు అనిపించింది.

బాటమ్ లైన్:

చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమాతో యువత ఎంజాయ్ చేయడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.రొటీన్ స్టోరీ లాగా కాకుండా కాస్త కొత్తదనంతో పాటు సరదాగా నవ్వుకునే విధంగా ఈ సినిమా ఉందని చెప్పవచ్చు.

రేటింగ్: 2/5

" autoplay>

తాజా వార్తలు