కరోనా రెండో దశ కారణం చేత ఎన్నో సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలను వాయిదా వేసుకుంటూ వస్తున్నాయి.ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యి మంచి విజయాలను అందుకున్నాయి.
ఈ క్రమంలోనే మరి కొన్ని సినిమాలను థియేటర్లోనే విడుదల చేయాలని దర్శకనిర్మాతలు థియేటర్లో తెరచే వరకు వేచిచూశారు.ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా థియేటర్లు తెరచుకోవడంతో ఇప్పటికే కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి.
ఈ క్రమంలోనే నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన “లవ్ స్టోరీ” సినిమాని కూడా వచ్చే నెల 10వ తేదీన విడుదల చేయాలని చిత్రబృందం అధికారికంగా ప్రకటించారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం చేత వాయిదా పడుతూ వస్తోంది.
ఈ క్రమంలోనే వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.అయితే తాజాగా ఈ సినిమా విడుదల మళ్లీ వాయిదా పడుతున్నట్లు తెలుస్తుంది.
ఆగస్టు 10వ తేదీన నాని హీరోగా నటించినటువంటి “టక్ జగదీష్ ” చిత్రం అదే రోజే ఓటీటీలో విడుదల కానుంది.అదే విధంగా నాని హీరోగా నటించిన మాస్ట్రో చిత్రం కూడా ఈనెల 9వ తేదీ డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం కానుంది.

ఇదిలా ఉండగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమాని కూడా సెప్టెంబర్ 10వ తేదీ విడుదల కావడంతో లవ్ స్టోరీ సినిమాను మరోసారి విడుదల వాయిదా వేయాలని ఆలోచనలు చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమాను ఈ నెల 17న విడుదల చేయాలనే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నారు.అయితే ఓటీటీలో విడుదలయ్యే సినిమాలలో ఏవైనా వాయిదా వేసుకుంటే ఈ సినిమా విధిగా సెప్టెంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు.
మరి ఈ చిత్రం విడుదల తేదీ పై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.