ప్రేమికుల రోజున అదిరిపోయే గిఫ్ట్ ఇస్తోన్న లవ్‌స్టోరి

ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘లవ్ స్టోరి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తోండగా ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది.

 Love Story Movie Song To Be Out On Valentines Day-TeluguStop.com

ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్ అందుకోవడానిక శేఖర్ కమ్ముల రెడీ అవుతున్నాడు.అయిత ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మాత్రమే రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, ప్రేమికుల రోజుకు అదిరిపోయే గిఫ్ట్‌ను ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.కాగా ఈ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్‌ను ప్లాన్ చేశాడు దర్శకుడు శేఖర్ కమ్ముల.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, ప్రేమికుల రోజును పురస్కించుకుని మరొక గిఫ్ట్‌ను ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

ఈ సినిమాలోని తొలి సాంగ్‌ను చిత్ర యూనిట్ ‌ప్రేమికుల రోజున రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

లవర్స్ డేకు ఇది పర్ఫెక్ట్ కానుక అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.ఏదేమైనా నాగచైతన్య, సాయి పల్లవిల కాంబినేషన్ అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డ ఈ సినిమా నుండి తొలి సాంగ్ రిలీజ్ అవుతుండటంతో ప్రేమికుల రోజు సంపూర్ణం అవుతుందని చిత్ర యూనిట్‌తో పాటు అభిమానులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube