టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు చిరంజీవి( Chiranjeevi )ఒకరు.ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు.
ఇలా ప్రేక్షకులు మాత్రమే కాకుండా చిరంజీవి అంటే సెలబ్రిటీలు కూడా ఎంతో ఇష్టపడుతూ ఉంటారు.అలా చిరంజీవిని ఆరాధించే వారిలో నటుడు శ్రీకాంత్ ( Sreekanth ) ఒకరు.
ఈయన చిరంజీవిని ఎంతో అభిమానించడమే కాకుండా తనని అన్నయ్య అంటూ పిలుస్తూ ఉంటారు.
ఇక శ్రీకాంత్ పిల్లలు కూడా చిరంజీవి గారిని ఎంతో ఆప్యాయంగా పెదనాన్న అంటూ పిలుస్తూ ఉంటారు.ఇలా ఈ హీరోలు ఇద్దరు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని చెప్పాలి.ఇకపోతే మార్చి 23వ తేదీ శ్రీకాంత్ పుట్టినరోజు( Birthday ) కావడంతో చిరంజీవి శ్రీకాంత్ కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు.
స్వయంగా కేక్ తీసుకొని ఒక ఫ్లవర్ బొకే తీసుకొని శ్రీకాంత్ ఇంటికి వెళ్లి మరి తనకు విషెస్ చెప్పడమే కాకుండా కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలను సెలెబ్రేట్ చేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చిరంజీవి తీసుకువెళ్లిన కేక్ పై హ్యాపీ బర్త్ డే శ్రీకాంత్ లవ్ ఫ్రమ్ అన్నయ్య( Love From Annayya )అంటూ రాయించడం చాలా హైలైట్ గా మారింది.ఇలా ఒక స్టార్ హీరో మరో హీరో ఇంటికి వెళ్లి పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
ఇలా కేక్ కట్ చేసిన అనంతరం తన ఫ్యామిలీతో కలిసి చిరంజీవి కాసేపు సరదాగా ముచ్చటించారు.ప్రస్తుత ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో నేటిజన్స్ శ్రీకాంత్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలని తెలియజేస్తున్నారు.
ఇక వీరిద్దరి కాంబినేషన్లో శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.