ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉండడంతో వాహన ప్రియులు ఎలక్ట్రిక్ వాహనాలను( Electric vehicles ) కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థలు సరికొత్త టెక్నాలజీలతో అద్భుతమైన ఫీచర్లు ఉన్న కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఈ నేపథ్యంలో అడ్వాన్స్ టెక్నాలజీ కలిగిన కార్లు మార్కెట్లోకి తక్కువ బడ్జెట్ లోనే విడుదల అవుతున్నాయి.

లోటస్ ఎమెయా హైపర్-GT( Lotus Emea Hyper-GT ) నుంచి సరికొత్త ఫీచర్లతో మొదటి నాలుగు డోర్ల కారు మార్కెట్లోకి అడుగు పెట్టింది.లగ్జరీ లైఫ్ స్టైల్ ఎలక్ట్రిక్ వాహనాల లైనప్ లో ప్లాగ్ షిప్ మోడల్ గా లోటస్ ఎమెయా హైపర్-GT ఎలక్ట్రిక్ కారు చేరింది.ఈ ఎలక్ట్రిక్ కారు వెనుక వైపు స్టైలిష్ టెయిల్ ల్యాంప్ తో వస్తుంది.ఈ కారులో హై పవర్ డ్యూయల్ మోటార్ సెట్ అప్ ఫీచర్లు ఉండడం వల్ల గంటకు 250 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.2.8 సెకండ్ల కాలంలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకో గలదు.

ఈ కారులో పయనీరింగ్ యాక్టివ్ ఫ్రంట్ గ్రిల్, రియల్ డిఫ్యూజర్, రియర్ స్పాయిలర్ లాంటి అధునాతన, యాక్టివ్ ఏరో డైనమిక్ ఫీచర్లు ఉన్నాయి.కార్ క్యాబిన్ చుట్టూ ఎల్లో కలర్ స్ట్రిప్ తో డ్యూయల్ టోన్ ఇంటిరీయర్.ఇందులో ప్రత్యేకంగా ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ తో కూడిన డిస్ ప్లే తో ఉంటుంది.
ఈ లోటస్ ఎమెయా హైపర్-GT ఎలక్ట్రిక్ కారు 350kw DC ఫాస్ట్ చార్జర్ తో వస్తుంది.కేవలం 18 నిమిషాల్లోనే 80 శాతం వరకు బూస్ట్ రేంజ్ ను అందించగలుగుతుంది.
ఈ కారుకు సంబంధించి మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.







