ఈ జ్యూస్ తో మీరు బరువు తగ్గడం ఇక మరింత సులభం!

అధిక బరువు( overweight ) అనేది ఎంతోమందిని కలవర పెడుతున్న సమస్య.

ఓవర్ వెయిట్ కారణంగా అనేక దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే రిస్క్ పెరగడమే కాకుండా బాడీ షేమింగ్ కామెంట్స్ ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే ఏబిసిడి జ్యూస్( ABCD Juice ) ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ జ్యూస్ తో మీరు బరువు తగ్గడం మరింత సులభం అవుతుంది.జ్యూస్ తయారీ కోసం ముందుగా అరకప్పు క్యారెట్ ముక్కలు( Carrot slices ), అరకప్పు బీట్ రూట్ ముక్కలను( Slice the beet root ) స్క్రీమ్ చేసి పెట్టుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో స్క్రీమ్ చేసి పెట్టుకున్న బీట్ రూట్, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి.అలాగే గింజ తొలగించి సన్నగా తరిగిన ఒక ఉసిరికాయ, నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు మరియు ఒక గ్లాసు వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకుంటే మన ఏబిసిడి జ్యూస్ రెడీ అవుతుంది.

Advertisement
Losing Weight Is Easier With This Juice! Weight Loss, Weight Loss Tips, Weight L

ఉసిరి, బీట్‌రూట్, క్యారెట్, ఖర్జూరాలతో ( amla, beetroot, carrot, dates )తయారైన ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా బ్రేక్ ఫాస్ట్ లో లేదా వ్యాయామాల త‌ర్వాత‌ తీసుకుంటే చాలా ప్రయోజనాలు పొందుతారు.

Losing Weight Is Easier With This Juice Weight Loss, Weight Loss Tips, Weight L

ప్ర‌ధానంగా ఈ జ్యూస్ మెటబాలిజం రేటును పెంచుతుంది.అతి ఆకలిని నియంత్రిస్తుంది.కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.

కేలరీలు కరిగే ప్రక్రియను వేగవంతం చేసి వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.బరువు తగ్గాలి అనుకుంటున్న వారికి ఈ జ్యూస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

పైగా ఉసిరిలో అధికంగా ఉండే విటమిన్ సి రక్తాన్ని శుద్ధి చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.బీట్‌రూట్, క్యారెట్‌ మరియు ఖర్జూరాల్లో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తాయి, రక్తహీనతను తగ్గిస్తాయి.

Losing Weight Is Easier With This Juice Weight Loss, Weight Loss Tips, Weight L
నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

అంతేకాకుండా ఈ ఏబిసిడి జ్యూస్ మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.స్టామినాను పెంచి శరీరానికి ఉత్సాహంగా మారుస్తుంది.చ‌ర్మం నిగారింపుగా మెరిసేలా ప్రోత్స‌హిస్తుంది.

Advertisement

మరియు టాక్సిన్లను తొల‌గించి శ‌రీరాన్ని డీటాక్స్ చేస్తుంది.

తాజా వార్తలు