సాధారణంగా కొందరి లిప్స్( Lips ) అనేవి పిగ్మెంటేషన్ వల్ల చాలా డార్క్ కలర్ లో ఉంటాయి.డార్క్ లిప్స్ ( Dark lips )ను గులాబీ రంగులో మెరిపించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.
కానీ ఫలితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి.అసలు లిప్ పిగ్మెంటేషన్ కు కారణాలేంటి.? ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.లిప్ పిగ్మెంటేషన్ ( Lip pigmentation )కు అనేక కారణాలు ఉన్నాయి.
ప్రధానంగా ఎండల ప్రభావం, స్మోకింగ్, విటమిన్ బి12 లోపం, హార్మోన్ చేంజ్, పలు రకాల మందుల వాడకం, రసాయనాలు అధికంగా ఉండే లిప్ స్టిక్స్ ఉపయోగించడం, టీ కాఫీలు( Tea coffees ) అధికంగా తీసుకోవడం, ఒంట్లో వేడి తదితర కారణాల వల్ల లిప్స్ పిగ్మెంటేషన్ కు గురవుతాయి.
దాంతో పెదాలు నల్లగా అందవిహీనంగా మారతాయి.అయితే పిగ్మెంటెడ్ లిప్స్ ను రిపేర్ చేయడానికి ఒక అద్భుతమైన రెమెడీ ఉంది.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ షుగర్ ( Sugar )వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ ములేటి పౌడర్,( Muleti powder ) వన్ టీ స్పూన్ తేనె( Honey ) మరియు వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసుకుని సున్నితంగా రెండు లేదా మూడు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకోవాలి.
అనంతరం వాటర్ తో శుభ్రంగా పెదాలను క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీని వారానికి రెండు సార్లు కనుక పాటిస్తే పిగ్మెంటేషన్ అనేది తగ్గు ముఖం పడుతుంది.డార్క్ లిప్స్ గులాబీ రంగులోకి మారడమే కాకుండా షైనీగా మెరుస్తాయి.
అలాగే పిగ్మెంటేషన్ తగ్గాలంటే ఈ రెమెడీని పాటించడం తో పాటు లిప్స్ హైడ్రేట్ గా ఉండడానికి న్యాచురల్ అండ్ సన్ ప్రొడక్షన్ లిప్ బామ్స్ ఉపయోగించండి.స్మోకింగ్ అలవాటును మానుకోండి.
కెఫిన్ చాలా పరిమితంగా తీసుకోండి.శరీరానికి సరిపడా నీటిని అందించండి.
మరియు హెల్తీ డైట్ ను మెయింటైన్ చేయండి.