తమ నగరంలో ఇండియన్ కాన్సులేట్‌ను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు లాస్ ఏంజెల్స్ మేయర్ కరెన్ బాస్( Los Angeles Mayor Karen Bass ).అమెరికాలో రెండవ అతిపెద్ద నగరంగా, ప్రపంచ వినోద రాజధానిగా వున్న లాస్ ఏంజెల్స్‌లో కాన్సులేట్ వుంటే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, చికాగో, హ్యూస్టన్, అట్లాంటాలలో ఐదు భారతీయ కాన్సులేట్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి.జూన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించిన సందర్భంగా .భారత్ త్వరలో రెండు కాన్సులేట్లను ప్రారంభిస్తుందని, ఇందులో ఒకటి సియాటిల్‌లో ఓపెన్ చేస్తామని చెప్పారు.అయితే భారతీయ అమెరికన్లు, కరెన్ బాస్ రెండవ కాన్సులేట్‌ను లాస్ ఏంజెల్స్‌లో పెట్టాలని కోరుతున్నారు.
అమెరికాలో కొత్తగా భారతీయ కాన్సులేట్ కార్యాలయం( Indian Consulate Office ) విషయంలో లాస్ ఏంజెల్స్ నగరాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని అక్కడి భారత రాయబారి తరంజిత్ సింగ్ సింధూకు ఇటీవల లేఖ రాశారు కరెన్ బాస్.ఇక్కడ కాన్సులేట్ కార్యాలయం తెరిచేందుకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహాకారాలను అందిస్తానని ఆమె పేర్కొన్నారు.భారత్-లాస్ ఏంజెల్స్ మధ్య పర్యాటకం పాటు వివిధ రంగాల్లో కీలక సంబంధాలు వున్నాయన్నారు.భారత్‌లో టూరిజం కార్యాలయం కోసం లాస్ ఏంజెల్స్ పెట్టుబడి పెట్టిందని.దానిని 2019లో ప్రారంభించామని మేయర్ గుర్తుచేశారు.కోవిడ్ 19 మహమ్మారి కాలంలోనూ అది తెరిచే వుందని కరెన్ పేర్కొన్నారు.
లాస్ ఏంజెల్స్‌కు ప్రతి ఏడాది లక్షకు పైగా భారతీయ సందర్శకులు వస్తూ వుండటంతో కాన్సులేట్ కార్యాలయం వుండటం అన్ని విధాల శ్రేయస్కరమన్నారు.అలాగే ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడానికి కూడా కాన్సులేట్ కార్యాలయం దోహదం చేస్తుందని కరెన్ బాస్ చెప్పారు.
ఇకపోతే.అగ్రరాజ్యం అమెరికా భారతీయులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది.2023లో మన పౌరులకు 10 లక్షల వీసాలు జారీ చేస్తామని ప్రకటించిన ఆ దేశ విదేశాంగ శాఖ వాగ్థానాన్ని నెరవేర్చింది.ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్‌లో( US Embassy ) తెలిపింది.
ఈ ఏడాది మిలియన్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయాలన్న మా లక్ష్యం నెరవేరిందని.రాబోయే కాలంలో మరింత పురోగతిని సాధిస్తామని, మరింత ఎక్కువ మంది భారతీయులు అమెరికా వెళ్లేందుకు అవకాశం కల్పిస్తామని యూఎస్ ఎంబసీ ట్వీట్లో పేర్కొంది.