తన చిట్టి చెల్లెళ్ల కోసం ఆ చిన్నారి ఏం చేసిందో చూడండి!

పిట్టకొంచెం కూత ఘనం అనే నానుడి గురించి వినే వుంటారు.తన ఇద్దరు చిట్టి చెల్లెళ్ల కోసం ఓ నాలుగేళ్ల చిన్నారి చేసిన పని చూశారంటే మీరు విస్తుపోతారు.

 Look What The Little Girl Did For Her Little Sisters, Sister, Love, Viral Latest-TeluguStop.com

ఇంత చిన్నవయస్సులోనే చెల్లెళ్ల కాపాడటానికి ఆమె పడిన ఆరాటం చూస్తే ముచ్చటేస్తుంది.ఆ పాపకు నాలుగేళ్లు ఉంటాయేమో.

తన ఇద్దరు చిట్టి చెల్లెళ్లతో రోడ్డుమీద ఆడుకుంటోంది.అదే సమయంలో అక్కడికి ఓ వాహనం రాగా అప్రమత్తమైన ఆ చిన్నారి ఆ వాహనాన్ని రెండు చేతులు అడ్డుపెట్టి ఆమడదూరం ఉండగానే అదుపుచేసింది.

ఆ వెంటనే తన చెల్లెళ్లను ఒక్కొక్కరిగా తన ఇంట్లోకి తీసుకుపోవడం ఈ వీడియోలో గమనించవచ్చు.ఇక ఆ వాహన దారుడు వాళ్ళు వెళ్లిపోవడాన్ని గమనించి తన వాహనాన్ని ముందుకు పోనించాడు.

కాగా ఆమె చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.చిన్నారి స‌మ‌య‌స్ఫూర్తికి, తోబుట్టువుల‌ను కాపాడుకోవాల‌నే త‌ప‌న‌కు నెటిజ‌న్లు ఆమెని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

యోగ్ అనే యూజ‌ర్ ట్విట్ట‌ర్‌లో ఈ వీడియోను షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సదరు యూజర్ ఆ వీడియోని పోస్టు చేస్తూ సోద‌రి పాత్ర‌ను ఈ పాప సీరియ‌స్‌గా పోషించింద‌ని వీడియోకు క్యాప్ష‌న్ కూడా ఇవ్వడం కొసమెరుపు.కాగా ఈ వీడియోను 2 ల‌క్ష‌ల మందికి పైనే చూశారు.ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.

ఈ క్రమంలో ఓ యూజర్ ఈ చిన్నారికి నేను బిగ్ హ‌గ్ ఇవ్వాల‌నుకుంటున్నాన‌ని అనగా మరో యూజర్ అద్భుతం.పాప‌కు నాలుగైదేండ్లు ఉంటాయేమో! నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి అని కామెంట్ పెట్టాడు.

ఇంకెందుకాలస్యం మీరు కూడా ఆ వీడియోని చూసి తోచింది రాయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube