ఆటో ఎక్స్‌పో 2023: అతి పొడవైన లగ్జరీ బస్సును ఆవిష్క‌రించిన ప్ర‌ముఖ కంపెనీలు... మ‌రిన్ని విశేషాలివే..

ఢిల్లీలో జ‌రుగుతున్న ఆటో ఎక్స్‌పో 2023లో ఎలక్ట్రిక్ వాహనాల ఆధిపత్యం కనిపించింది.ఈసారి ఆటో ఎక్స్‌పో 2023లో చాలా కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శించాయి.

 Longest Luxury Bus Has Been Unveiled , Longest Luxury Bus,auto Expo 2023 , Delhi-TeluguStop.com

ఈసారి అనేక ఎలక్ట్రిక్ బస్సులు కూడా ప్ర‌ద‌ర్శిత‌మ‌య్యాయి.ఇందులో జేబీఎం, వోల్వో, ఐషర్, అశోక్ లేలాండ్ వంటి కంపెనీలు తమ లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ బస్సులను ఆవిష్కరించాయి.

జేబీఎం ఆటో ఎక్స్‌పోలో కొత్త శ్రేణి బస్సులను పరిచయం చేసింది.ఇందులో సిటీ ఇంటర్‌సిటీ మరియు లగ్జరీ గెలాక్సీ కోచ్ బస్సులు ఉన్నాయి.

అదేవిధంగా వోల్వో మరియు ఐషర్ మోటార్స్ భారతదేశంలోనే అత్యంత పొడవైన ఎలక్ట్రిక్ బస్సును విడుదల చేశాయి.

ఈ బస్సు 1000 కిలోమీటర్ల మైలేజీ.

జేబీఎం తన ఎలక్ట్రిక్ బస్సుల శ్రేణిని ఆటో ఎక్స్‌పో 2023 మొదటి రోజున విడుదల చేసింది.అలాగే జేబీఎం ఎకోలైఫ్ ఎలక్ట్రిక్ సిటీ బస్సు, జేబీఎం ఎబిజ్ లైఫ్ ఎలక్ట్రిక్ బస్సు మరియు జేబీఎం ఈ-స్కూల్ లైఫ్ ఎలక్ట్రిక్ బస్సులను అంద‌రికీ పరిచయం చేసింది.

కంపెనీ ఈ బస్సులను షోలో ప్రదర్శించింది.కానీ వాటి ధరలను మాత్రం వెల్లడించలేదు.

గెలాక్సీ కోచ్‌తో వచ్చే బస్సు గురించి చెప్పుకోవల‌సి వ‌స్తే ఇది అధిక శక్తి సాంద్రతతో అధునాతన లిథియం అయాన్ బ్యాటరీతో వస్తుంది.దీని పరిధిని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 1000 కిమీల వరకు ప్ర‌యాణించ‌గ‌ల‌ద‌ని కంపెనీ పేర్కొంది.

Telugu Ashok Leyland, Auto Expo, Eicher, Longrange, Volvo, Volvoeicher-Latest Ne

భారతదేశపు అతి పొడవైన ఎలక్ట్రిక్ బస్సు వోల్వో మరియు ఐషర్ మోటార్స్ కలిసి భారతదేశపు అతి పొడవైన ఎలక్ట్రిక్ బస్సును ప్రజలకు అందించాయి.ఈ ఎలక్ట్రిక్ బస్సు పొడవు 13.5 మీటర్లు.ఆటో ఎక్స్‌పోలో, వోల్వో గ్రీన్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి వోల్వో 9600 ప్రీమియం ఎలక్ట్రిక్ కోచ్ షోకేస్‌ను పరిచయం చేసింది.

అలాగే ఐషర్ ప్రో 8055 ఎల్‌ఎన్‌జి/సిఎన్‌జి ట్రక్కును ఈవెంట్‌లో ఆవిష్కరించింది.ఈ బస్సును ఆవిష్కరించడంతో పాటు, ఐచర్ తన ప్రో 2049 ఎలక్ట్రిక్ 4.9టీ జీబీడ‌బ్ల్యు ట్రక్కును కూడా ఆవిష్కరించింది.

Telugu Ashok Leyland, Auto Expo, Eicher, Longrange, Volvo, Volvoeicher-Latest Ne

అశోక్ లేలాండ్ వాహ‌నాలివే.ఆటో ఎక్స్‌పో ఈవెంట్‌లో మొదటి రోజు, అశోక్ లేలాండ్ తన అనేక ఉత్పత్తులను ఆవిష్కరించింది.ఈ కార్యక్రమంలో, కంపెనీ తన బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్, హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వెహికల్, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ వెహికల్ ఇంటర్‌సిటీ సిఎన్‌జి బస్సు మరియు మినీ ప్యాసింజర్ బస్సులను ప్రజలకు ఆవిష్కారించింది.

ఇవి వాహ‌న ప్రియుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube