టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.తాజాగా ఈమె నటించిన శాకుంతలం (Shaakuntalam) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా అనుకున్న స్థాయిలో ఆదరణ సంపాదించుకోలేకపోయింది.ఈ సినిమా డిజాస్టర్ కావడంతో సమంత తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు.
ప్రస్తుతం ఈమె సిటాడెల్(Citadel) వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.అదేవిధంగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తో కలిసి ఖుషి (Khushi) సినిమాలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

ఇకపోతే విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా నుంచి విడుదలైన నా రోజా నువ్వే అనే సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ క్రమంలోనే సమంత ఖుషి సినిమాలోని తన లుక్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఒక మోటివేషనల్ కొటేషన్స్ షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోషల్ మీడియా వేదికగా సమంత స్పందిస్తూ… నిశ్శబ్దంగా ఉండడం ఒంటరి జీవితాన్ని అనుభవించడం వల్ల మీ జీవితంలో మీరు ఎంతో శక్తివంతులుగా మారుతారు.జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న బాధలు మిమ్మల్ని ఏమీ చేయలేవు అంటూ ఉన్న ఒక కొటేషన్ షేర్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే సమంత ఇలా మోటివేషనల్ కొటేషన్స్ షేర్ చేయడం ఇది మొదటిసారి కాదు.
నాగచైతన్య(Nagachaitanya) తో విడాకులు తీసుకున్నప్పటినుంచి ఈమె తన మనసులోని భావాలను ఇలా కొటేషన్స్ రూపంలో తెలియజేస్తూ వచ్చారు.ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.







