టీడీపీ యువ నేత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) చేపట్టిన “యువగళం” పాదయాత్ర( Yuvagalam Padayatra ) ప్రారంభమై నేటికి 200 రోజులు కంప్లీట్ కావడం జరిగింది.జనవరి 27వ తారీకు ప్రారంభించిన పాదయాత్రలో.
ఇప్పటికీ 2700 కిలోమీటర్లకు పైగా నడవటం జరిగింది.ఈ సందర్భంగా 200 రోజులు పూర్తికావడంతో లోకేష్ సోషల్ మీడియాలో ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సంచలన పోస్ట్ పెట్టారు.
“యువగళం.జనబలం.
నవ్యాంధ్ర స్వరం ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం యువత కోసం, జనం భవిత కోసం యువగళమై నేను ముందడుగు వేశాను.ప్రజలే నన్ను ముందుండి నడిపిస్తున్నారు.
యువగళం పాదయాత్రలో పడుతున్న నా అడుగులు.అరాచక వైకాపా సర్కారు( YCP ) గుండెల్లో పిడుగులు.
నా పాదయాత్ర.జనచైతన్య యాత్రగా మారింది.యువగళం…ప్రజాగళమై నినదిస్తోంది.నాలుగేళ్ల సైకో జగన్( CM Jagan ) పాలన జనం పాలిట ఎంత నరకంగా ఉందో ప్రత్యక్షంగా చూశాను.
సకలవర్గాలూ వైకాపా కాలకేయుల బాధితులే! 200 రోజులు, 2700 కి.మీ.పాదయాత్ర నాకు జగమంత కుటుంబాన్ని ఇచ్చింది.
ఏ ఊరు వెళితే, ఆ ఊరువాడిగా ఆదరించారు.ఏ వాడలో ఉంటే, ఆ వాడ మనిషిని చేసుకున్నారు.పల్లెలు ఆప్యాయంగా పలకరించాయి.
పట్టణాలు అభిమానంతో స్వాగతించాయి.కుల,మత,ప్రాంతాలకు అతీతంగా యువగళం జనబలమైంది.
అందరి సమస్యలూ దగ్గరుండి చూశాను.అభివృద్ధికి దూరమై, అరాచకంతో ధ్వంసమైన రాష్ట్ర దుస్థితి నాలో కసి రగిల్చింది.
భుజం నొప్పి బాధిస్తోంది, ప్రజలు పడుతున్న బాధల కంటే ఎక్కువేం కాదు.కాళ్లు బొబ్బలెక్కాయి, జనం కష్టాల కన్నీళ్ల కంటే నొప్పి ఏమీ లేదు.
చేతులు రక్కుకుపోయాయి, వైకాపా దాడులతో రక్తమోడుతున్న వారి కంటే కష్టమేం కాదు.యువగళంతో జనగళం కలిసింది.
కోట్లాది గొంతుకలు ఒక్కటై సైకో పోవాలి-సైకిల్ రావాలి అని నినదిస్తున్నాయి.
లక్షలాది మంది ఫోటోలు దిగారు, వేలాది మంది తమ సమస్యలు తెలియజేశారు, జనసంద్రంలో కొందరిని కలవలేకపోయాను.కొందరి వినతులు అందుకోలేకపోయి ఉండొచ్చు.పెద్ద మనసుతో మన్నించండి.
వేలాది వినతులు వచ్చాయి.అన్నింటికీ పరిష్కారం చూపించే చంద్రన్న ప్రభుత్వం( Chandrababu Naidu ) వస్తుంది.
వైకాపా రాక్షస మూకలు అడ్డంకులు కల్పించినా, వాతావరణం పరిస్థితులు అనుకూలించకపోయినా .నిద్రాహారాలు మాని యువగళం గమ్యం వైపు నా వెంట నడుస్తున్న మీ అందరి త్యాగం వృధా పోదు.నా యువగళం పాదయాత్ర నిర్విరామంగా, నిరాఘాటంగా కొనసాగడానికి కృషి చేస్తోన్న ప్రజలు, టిడిపి నేతలు, కార్యకర్తలు, అభిమానులు, యువగళం కమిటీలు, వలంటీర్లు, వైద్యసిబ్బంది, మీడియాకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను”.అని అన్నారు.