ఏపీలో ఈనెల 26వ తేదీ నుంచి వైసీపీ బస్సు యాత్ర కొనసాగనుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.తమ ప్రభుత్వం వచ్చాక బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ వేల కోట్లు దోచుకున్నారని మంత్రి అంబటి ఆరోపించారు.ఎన్నికల ముందు కక్ష సాధింపు ఏంటని ప్రశ్నించారు.
ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబును అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.టీడీపీ సర్వనాశనం కావడానికి లోకేశే కారణమని ఆరోపణలు చేశారు.







