లోక్‎సభ ఎన్నికల 4వ విడత నోటిఫికేషన్ విడుదల

లోక్‎సభ ఎన్నికల నాల్గవ విడత నోటిఫికేషన్( Lok Sabha Elections Fourth Phase Notification ) విడుదలైంది.ఈ మేరకు తెలంగాణలోని పార్లమెంట్ స్థానాలతో పాటు ఏపీలో అసెంబ్లీ, లోక్‎సభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

 Lok Sabha Elections 4th Phase Notification Released,lok Sabha Elections 4th Phas-TeluguStop.com

తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక( Secunderabad Cantonment Assembly Election )కు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది.ఇక ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి నామినేషన్లను అధికారులు స్వీకరించనున్నారు.
ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది.

ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ( Nominations Process ) సాగనుంది.ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన కొనసాగనుండగా… నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 29 వరకు ఉంది.

అదేవిధంగా మే 13న పోలింగ్ నిర్వహణ ఉండనుండగా.జూన్ 4న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube