కరోనా వైరస్ ఏమో గానీ చాలా దేశాలు కఠిన నియమాలను విధించి ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాయి.ఈ క్రమంలో దాదాపు వందకు పైగా దేశాలు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తూ కరోనా ను కట్టడి చేయడానికి యత్నిస్తున్నాయి.
అయితే ఇంతగా ప్రభుత్వాలు కఠిన నియమనిబంధనలు విధిస్తున్నప్పటికీ చాలామంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.యూరోప్ దేశాల్లో చాలా మటుకు ఈ లాక్ డౌన్ ను కఠినంగా అమలు పరుస్తున్నప్పటికీ స్వీడన్ లో మాత్రం ఎలాంటి లాక్ డౌన్ లేకుండా కరోనా తాట తీస్తోంది.
దేశవ్యాప్తంగా కేసులు,మరణాలు పెరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.అయితే ప్రజలకు సాధ్యమైనంత ఎక్కువ స్వేచ్ఛ కల్పించడమే తమ లక్ష్యం అంటూ ఆ దేశం చెబుతుంది.
ఈ క్రమంలోనే స్కూళ్లు,హోటళ్లు,దుకాణాలు ఇలా ఎన్నో రంగాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పని చేస్తున్నాయి.
స్వీడన్ తన ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తుంటుంది.
అక్కడ చాలామందికి ఆరోగ్యసేవలు ఉచితం.అవి మనదేశంలో మాదిరిగా కాకుండా చాలా మెరుగ్గా ఉంటాయి.
కరోనా ఎక్కువగా వృద్ధుల్లో సోకుతుండడంతో స్వీడన్ ప్రభుత్వం వారిని జాగ్రత్తగా చూసుకుంటోంది.కేర్ హోంలలో పరీక్షలు నిర్వహిస్తోంది.
ఇతర ప్రజల్లోనూ టీకాలతో వ్యాధినిరోధక శక్తి పెంచుతోంది.కరోనాకు మందు లేకపోవడంతో.
ప్రజలు దాన్ని తట్టుకునేలా ఇమ్యూనిటీని పెంచుతోంది.కరోనా తొలిరోజుల్లో ప్రజలపై కొన్ని ఆంక్షలు విధించినా తర్వాత వాటిని తీసేశారు.
హెర్డ్ ఇమ్యూనిటీ(సామూహిక రోగ నిరోధక శక్తి) లక్ష్యంగా అక్కడ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి.‘మరికొన్ని రోజుల్లో మేం హెర్డ్ ఇమ్యూనిటీ దశకు చేరుకుంటాం.ప్రస్తుతానికి దేశంలో పరిస్థితి అదుపులోనే ఉంది.’ అని ప్రభుత్వ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆండర్స్ టెగ్నెల్ చెప్పారు.

స్వీడన్ లో 16 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.1937 మంది చనిపోయారు.అయితే ఈ కేసులన్నీ మహమ్మారి తొలిరోజుల్లో విస్తరించినవే.నెల రోజులుగా ఆ దేశంలో కేసులు సంఖ్య, మరణాలు భారీగా తగ్గిపోయాయి.ప్రజలు కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అభివృద్ధి చెందిన దేశం కావడం, మెరుగైన వైద్య సదుపాయాలతోపాటు జనసాంద్రత కూడా తక్కువ కావడంతో కోటికిపైగా జనాభా ఉన్న స్వీడన్ కరోనాపై పోరులో చాంపియన్ అనిపించుకుంటోంది.