నేటి నుంచి తెలంగాణ హైకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం

తెలంగాణ హైకోర్టులో జరిగే కేసుల విచారణ నేటి నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది.

కేసుల విచారణను సామాన్యులు సైతం వీక్షించేలా సుప్రీం ధర్మాసనం ఇటీవలే ప్రత్యక్ష ప్రసారాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

ఈ విధంగానే ఇవాళ్టి నుంచి హైకోర్టులో విచారణను కూడా ప్రజలు వీక్షించే అవకాశం కల్పిస్తున్నారు.దీనిలో భాగంగా మొదటి కోర్టు హాలులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూయన్ నేతృత్వంలోని ధర్మాసనం జరిపే కేసుల విచారణను తొలిసారిగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

జాతీయ ప్రాధాన్యం ఉన్న కేసులతో పాటు రాజ్యాంగ అంశాలకు సంబంధించిన కేసుల విచారణను లైవ్ ఇవ్వడానికి న్యాయస్థానం అంగీకారం తెలిపింది.ఈ వాదనలు ప్రారంభం అయ్యే ముందే ప్రత్యక్ష ప్రసారం గురించి అధికారులకు తెలియజేస్తారు.

న్యాయవాదులకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే బెంచ్ ముందు చెప్పేందుకు అనుమతి ఇచ్చారు.అయితే, దేశ చరిత్రలోనే తొలిసారిగా హైకోర్టు ఆన్ లైన్ లో కేసుల విచారణను చేపట్టింది.

Advertisement
యూఎస్ లో ప్రీ సేల్స్ విషయంలో దేవర అరాచకం.. ఈ రికార్డ్స్ ఎవరికీ సాధ్యం కాదంటూ?

తాజా వార్తలు