ఈమధ్య సీనియర్ స్టార్ హీరోలకు అంతగా కలిసి రావడం లేదు.వరుస అవకాశాలు వచ్చినప్పటికీ కూడా అంతగా సక్సెస్ కాలేకపోతున్నారు.
మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో వచ్చినప్పటికీ కూడా ప్రేక్షకులను అంతగా అకట్టుకోలేకపోతున్నారు.దీంతో ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోలు కొన్ని రోజుల వరకు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నారు.
ప్రస్తుతం చిరంజీవి, బాలయ్య మాత్రం బాగానే పరుగులు తీస్తున్నారు.కానీ నాగార్జున, వెంకటేష్ మాత్రం అంతగా కనిపించడం లేదు.
రెండు సినిమాలకు మధ్య చాలా బ్రేక్ తీసుకుంటున్నారు.అంతే కాదు ఈమధ్య వీళ్ళ నుంచి ఎటువంటి హిట్ టాక్ కూడా రావట్లేదు.
అయితే ఇటీవలే వెంకటేష్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.కొన్ని రోజుల వరకు తను సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు.
మంచి కథ వస్తే అప్పుడు ఓకే చేస్తాను అని.అప్పటి వరకు ఏ సినిమాలకు కమిట్మెంట్ ఇవ్వను అని అన్నారు.దీంతో ఆయన అభిమానులు చాలా నిరాశ చెందారు.
అయితే తాజాగా నాగార్జున కూడా తన అభిమానులను నిరాశ పరుస్తున్నాడేమో అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.నాగార్జున కూడా గత కొంతకాలం నుంచి ఎటువంటి సినిమాలకు సైన్ చేయడం లేదు.
గతంలో వరుస సినిమాలతో ముందుకు వచ్చినా కూడా.అంతగా హిట్టును అందివలేకపోతున్నాడు.ఇక ద ఘోస్ట్ సినిమా తర్వాత నాగార్జున నుంచి ఎటువంటి సినిమా అప్డేట్లు లేవు.
ఆ సినిమా సమయంలోనే ఆయన ఓ ఆరు నెలల గ్యాప్ తీసుకుంటాను అని అనటంతో తన దగ్గరికి వచ్చినా కథలను కూడా రిజెక్ట్ చేస్తున్నాడు.మరీ ఈ ఆరు నెలలు ఎందుకు గ్యాప్ తీసుకున్నాడు తెలియదు కానీ.
బుల్లితెరపై మాత్రం ప్రతివారం బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.శని, ఆదివారాలలో బిగ్ బాస్ వేదిక మీదికి వచ్చి కంటెస్టెంట్ లతో సందడి చేస్తూ ఇంటికి పంపించే వాళ్ళని పంపించేస్తున్నాడు.
కానీ సినిమాలకు మాత్రం సైన్ చేయలేకపోతున్నాడు.
మరి దీనికి అసలు కారణం ఏంటో తెలియదు కానీ.బహుశా వరుస ఫ్లాప్స్ అందుకోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడు ఏమో అని అనిపిస్తుంది.ఒకప్పటిలా మంచి సక్సెస్ అందుకోవటం కోసం ఎంచుకున్న కథలను నాగార్జున ఎంచుకోలేకపోతున్నాడు.
అవకాశాలు వస్తున్నాయన్న ఆత్రుతతో నాగార్జున ఇష్టం వచ్చిన కథకు ఓకే చేయటంతో ఫ్లాప్స్ ఎదుర్కొన్నాడని అనిపిస్తుంది.అందుకే నాగార్జున అటువంటి తప్పులు మరోసారి చేయకుండా ఆలస్యమైన సరే వచ్చే కథ బాగుంటే చేయాలని ఫిక్స్ అయ్యాడేమో.
కాబట్టి మంచి కంటెంట్ ని తీసుకొచ్చే దర్శకుడి కోసం ఎదురు చూస్తున్నట్లు అర్థమవుతుంది.మరి నాగార్జున దగ్గరికి వచ్చే కథ ఎప్పుడొస్తుందో.ఏ డైరెక్టర్ ఏ కథను తీసుకొస్తాడో తెలియదు కానీ కొంతకాలం వరకు నాగార్జున సినిమాలకు దూరంగా ఉండి రెస్ట్ తీసుకోవడం ఖాయమని తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy