వర్షాలు పడినప్పుడు, మెరుపులు వచ్చినప్పుడు పిడుగులు అనేవి పడుతూ ఉంటాయి.పిగుడులు పడే సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి.
ఈ శబ్ధాలకు చాలామంది భయపడుతూ ఉంటారు.ఇంట్లో నుంచి బయటకు రారు.
పిడుగులు పడే ముందు ముందే ప్రజలను హెచ్చరించే టెక్నాలజీ కూడా వచ్చేసింది.వాతావరణశాఖ అధికారులు ఫోన్ లకు మెసేజ్ లు పంపుతున్నారు.
పిడుగు పడే అవకాశమున్న ప్రాంతాల్లోని ప్రజలకు మొబైల్ ద్వారా ముందుగానే సమాచారం పంపుతున్నారు.
మీ ప్రాంతాల్లో పిడుగు పడే అవకాశముందని, రానున్న గంట పాటు సురక్షిత ప్రాంతంలో ఉండలాలని సూచిస్తారు.
వర్షం పడుతున్నప్పుడు మెరుపులు రావడం, శబ్దాలు వస్తూ ఉంటాయి.అప్పుడు పిడుగు పడే అవకాశమంది.
పిడుగు పడి చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు.భారతదేశంలో పిడుగు కారణంగా వేలమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజాగా మెరుపులు, పిడుగులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో సముద్రం ఒడ్డున చాలా పడవులు నిలిపి ఉన్నాయి.జోరుగా వర్షం పడుతూ ఒక్కసారిగా పెద్దగా మెరుపులు వచ్చాయి.దీంతో సముద్రపు ఒడ్డున ఉన్న ఓ పడవపై పిడుగు పడింది.
ఓ మెరుపు వచ్చి తాకడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.పడం మొత్తం కాలి బూడిదైపోయింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది చూసిన వారు భయపడిపోతున్నారు.
సెకన్ల వ్యవధిలో పిడుగు పటటం చూసి జంకుతున్నారు.వెన్నులో వణుకు పుట్టేలా ఈ వీడియో ఉంది.పిడుగు పడే సమయంలో వచ్చే ఆ భారీ శబ్దం భయకరంగా ఉంది.9 సెకన్ల ఉన్న ఈ వీడియోను ఇప్పటివరకు 4 లక్షల 88 వేలకుపైగా మంది చూశారు.12 వేల మందికిపైగా వీడియోను లైక్ చేశారు.ఆ పడవ చాలా ఎత్తులో ఉందని, అందుకే దాని మీద పిడుగు పడిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.







