ఒడిశా రైలు ప్రమాదం.. బాధితుల కోసం ఎల్‌ఐసీ కీలక నిర్ణయం

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం( Odisha Train Accident ) అందరినీ కలిచివేస్తోంది.మూడు రైళ్లు ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరగ్గా.

 Lic Simplifies Claim Process For Coromandel Express Accident Victims Details, Od-TeluguStop.com

రైలు పట్టాలపై శవాలు గుట్టలుగా పడిపోవడం ప్రతిఒక్కరి హృదయాలను కదిలిస్తుంది.ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది.

ఇప్పటివరకు 300 మంది మరణించగా.వెయ్యి మందికిపైగా గాయపడ్డారు.

బాలాసోర్, భువనేశ్వర్ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.మృతుల్లో తెలుగువాళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురుమూర్తి( Gurumurthy ) అనే 60 ఏళ్ల వ్యక్తి ఈ రైలు ప్రమాదంలో చనిపోయాడు.

Telugu Latest, Licchairman, Lic, Odisha, Train Lic, Victims-Latest News - Telugu

ఏపీకి చెందిన మరికొంతమంది ప్రయాణికులు చనిపోయినట్లు తెలుస్తోంది.వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది.అయితే ఒడిశా రైలు ప్రమాదం బాధితుల కోసం భారత ప్రభుత్వ సంస్థ అయిన లైఫ్ ఇన్యూరెన్స్ ఆఫ్ ఇండియా( LIC ) కీలక నిర్ణయం తీసుకుంది.

ఎల్‌ఐసీ తీసుకున్న బాధితులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.బాధితులకు ఎల్‌ఐసీ క్లెయిమ్‌ను మరింత సులభతరం చేసింది.దీనికి సంబంధించి ఎల్‌ఐసీ ఛైర్మన్ సిద్దార్థ్ మహంతి శనివారం ప్రకటన చేశారు.ఈ రైలు ప్రమాదాల్లో మరణించిన బాధితుల కుటుంబసభ్యులు క్లెయిమ్ చేసుకోవడానికి రిజిస్టర్డ్ డెట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది.

Telugu Latest, Licchairman, Lic, Odisha, Train Lic, Victims-Latest News - Telugu

బాధితుల కుటుంబసభ్యులు ఎల్‌ఐసీ ఈజీగా క్లెయిమ్ చేసుకునేందుకు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసింది.అలాగే కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేసింది.వీటిని సంప్రదిస్తే క్లెయిమ్ ప్రాసెస్ సులువుగా చేస్తారని, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని సిద్దార్థ్ మహంతి తెలిపారు.క్లెయిమ్ సెటిల్‌మెంట్లు చాలా సులువు అవుతాయని చెప్పారు.రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సిద్దార్థ్.బాధితుల కోసం క్లెయిమ్ వెంటనే మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

కాగా బాలాసోర్ జిల్లాలోని బహంగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube