తెలంగాణ కాంగ్రెస్ చేవెళ్లలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ప్రజాగర్జన సభ ఈనెల 26న జరుగుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు.
బహిరంగ సభలో పాల్గొననున్న ఖర్గే సభా వేదికపై నుంచి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను విడుదల చేయనున్నారు.ఈనెల 21 నుంచి 25 వరకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.తిరగబడదాం – తరమికొడదాం కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న రేవంత్ రెడ్డి పార్లమెంట్ వారీగా కోఆర్డినేటర్లను నియమించామని పేర్కొన్నారు.29న వరంగల్ లో మైనారిటీ డిక్లరేషన్ విడుదల చేయాలని భావిస్తున్నామని తెలిపారు.ఓబీసీ, మహిళా డిక్లరేషన్ల కోసం సబ్ కమిటీని నియమిస్తామని వెల్లడించారు.మహిళా డిక్లరేషన్ సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామన్న ఆయన మేనిఫెస్టో విడుదలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.