సినిమా ఇండస్ట్రీలో తరచూ ఎన్నో రకాల సినిమాలో విడుదల అవుతూ ఉంటాయి.చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు చాలా రకాల సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి.
అయితే అందులో కొన్ని సినిమాలు చిన్న సినిమాలుగా విడుదల అయ్యి ఎక్కువ మొత్తంలో కలెక్షన్స్ ను సాధిస్తూ ఉంటాయి.అదే విధంగా ఎక్కువ బడ్జెట్ తో రూపొందిన సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద పరవాలేదు అనిపించేలా టాక్ నీ తెచ్చుకుంటూ ఉంటాయి.
అయితే సినిమా ఇండస్ట్రీలో కేవలం పరిమిత బడ్జెట్ తో తెరకెక్కి కళ్ళు చెదిరే స్తాయిలో చాలా సినిమాలు కలెక్షన్లను సాధించాయి.

ఇంతకీ ఆ సినిమాలు ఏవి అన్న విషయానికి వస్తే.అందులో టాప్ లో ఉన్న సినిమా లవ్ టుడే,( Love Today ) ప్రేమలు.( Premalu ) ఇందులో ప్రేమలు సినిమాను నాలుగు కోట్ల బడ్జెట్ తో రూపొందించగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 120 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమా ఇటీవలే మార్చి 8న విడుదల అయింది.అలాగే లవ్ టుడే సినిమా సినిమాకు ఐదు కోట్ల పెట్టుబడి పెట్టగా దాదాపుగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.
అదేవిధంగా నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2( Karthikeya 2 ) సినిమాను 15 కోట్లతో తెరకెక్కించగా ఈ సినిమా విడుదల అయ్యి 120 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.

777 చార్లీ( 777 Charlie ) సినిమాను 15 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా ఈ సినిమా 120 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.అలాగే గీతగోవిందం సినిమాను 15 కోట్లతో తెరకెక్కించగా ఈ సినిమా 120 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.అలాగే హనుమాన్ సినిమాను( Hanuman Movie ) 40 కోట్లతో నిర్మించగా ఈ సినిమా విడుదల ఈ 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.
కాంతార మూవీ( Kantara ) 40 కోట్లతో నిర్మించగా ఈ సినిమా దాదాపుగా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.ఇలా ఈ సినిమాలు తక్కువ బడ్జెట్ తో నిర్మితమై బాక్సాఫీస్ వద్ద ఎక్కువ కలెక్షన్లు సాధించాయి.