నంద్యాల జిల్లా శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డులో చిరుత పులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.ఓఆర్ఆర్ శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్ద గల గురుకుల పాఠశాల సమీపంలోని అటవీప్రాంతంలో స్థానికులకు చిరుత కనిపించింది.
ఈ క్రమంలోనే పశువులపై దాడికి యత్నిస్తుండగా చిరుతను వీడియో తీశారని తెలుస్తోంది.చిరుత సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో అప్రమత్తం అయ్యారు.