వైరల్‌ వీడియో : చిరుతను చీల్చి చెండాడిన కుక్కలు, ఇది మనుషులకు సందేశం

చిరుత పులి ఎదురుగా ఉంది అంటే మనుషులు అయినా ఏ ఇతర జంతువులు అయినా కూడా పారిపోవాల్సిందే.చిరుతకు దొరికితే ఆహారం అవ్వడం ఖాయంరా బాబోయ్‌ అంటూ పరుగు పెట్టే వారినే మనం చూశాం.

 Leopard Feared Dead After At A Time 10 Dogs Attack At Karnataka-TeluguStop.com

కాని అప్పుడప్పుడు ఎంత పెద్ద చిరుత పులి అయినా కూడా ఇతర జంతువులకు ఆహారం అవ్వడం కూడా జరుగుతుంది.తాజాగా కేరళలోని ఒక అడవిలో చిరుత పులిని చంపి తినేసి కుక్కల వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతుంది.

ఆ చిరుత పులి ఎంతగా ప్రతిఘటించినా కూడా కుక్కలు మాత్రం తాము అనుకున్నవి చేశాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… కేరళలోని కాల్పెట్టాలోని అటవి ప్రాంతంకు సమీపంలో ఉండే ఒక జనావాస కేంద్రంకు చిరుత పులి వచ్చింది.

అడవి పక్కన ఉన్న గ్రామం కనుక ఆ ఊర్లో ఎక్కువగా కుక్కలు పెంచుకుంటారు.అటవి జంతువుల నుండి రక్షణ కోసం కుక్కలను వారు గ్రామంలో ఉంచుకుంటారు.ఆ గ్రామస్తులను ఆ కుక్కలు కాపాడుతాయి.తాజాగా కూడా చిరుత బారి నుండి ఆ కుక్కలు జనాలను కాపాడటం జరిగింది.

ఊరిమీద పడి ఒక్కరికి కూడా గాయం చేయకుండానే చిరుతను అంతమొందించాయి.

వైరల్‌ వీడియో : చిరుతను చీల్చి

గ్రామంలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నించిన చిరుతను వెంటనే 10 కుక్కలు అడ్డుకున్నాయి.ఆ కుక్కలను భయపెడుతూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించినా కూడా కుక్కలు భయపడుతూనే ఆ చిరుతను అడ్డుకున్నాయి.కుక్కల నుండి తన వల్ల కాదనుకున్న చిరుత అక్కడ నుండి వెళ్లి పోయేందుకు ప్రయత్నించినా కూడా కుక్కలు వదల్లేదు.

చుట్టు చేరిన కుక్కలు ఆ చిరుతను మెల్ల మెల్లగా చంపేశాయి.ఆ తర్వాత పీక్కుతిన్నాయి.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.ఒక్క కుక్క ఉంటే చిరుతకు ఆహారం అయ్యేది.కాని పది కుక్కలు కలిసి ఉన్న కారణంగా చిరుతే కుక్కలకు ఆహారం అయ్యింది.ఈ సంఘటన నుండి మనుషులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటీ అంటే కలిసి ఉంటే ఎంత పనైనా సాధించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube