సోషల్ మీడియా అందరికీ అందుబాటులో వచ్చాక ముఖ్యంగా వన్యమృగాల వీడియోలను ఎక్కువగా చూడగలుగుతున్నాము.లేదంటే జనాలకి అడవుల గురించి, అడవి జంతువుల( Animals ) గురించి వినడమే తప్ప, చూసే అదృష్టం ఉండేది కాదని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే మనం మన దగ్గర వున్న అడవుల్ని నరికేసి బిల్డింగులు కట్టేస్తున్నాం కదా.అవును, ప్రపంచం నేడు ఒక కాంక్రీట్ జంగిల్( Concrete Jungle ) లాగా మారిపోతోంది.ఇక విషయంలోకి వెళితే, చిరుత పులి ఎటాక్ చేసిందంటే అవతల ఎంతపెద్ద జంతువైనా తలొగ్గాల్సిందే.ఎందుకంటే జంతువులపై చిరుత అదునుచూసి దాడి చేస్తుంది మరి.
అయితే ఇక్కడ వీడియోలో చూస్తే నడిరోడ్డుపై బబూన్ కోతి (కొండముచ్చు) పై ఎటాక్ చేసిన చిరుతకు చుక్కలు చూపించాయి మిగిలిన బబూన్ కోతులు.ఆ సమయంలో ఒక్కసారిగా అవి మూకుమ్మడిగా చిరుతపై( Leopard ) దాడికి దిగడంతో ఆ దాడికి తట్టుకోలేక పోయిన చిరుత పులి అక్కడి నుంచి పరుగు లంకించుకుంది.అయినా బబూన్ కోతులు( Baboon Monkeys ) వదల్లేదు సుమా.అడవిలో కొద్దిదూరం వరకు చిరుతను వెంబడించి మరీ తరిమి తరిమి కొట్టాయి.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు బబూన్ కోతుల ఐక్యతను తెగ మెచ్చుకుంటున్నారు మరి.ఈ ఘటన దక్షిణాఫ్రికాలో( South Africa ) జరిగినట్టు తెలుస్తోంది.రిక్కీ దా ఫోనెస్‌కా షేర్ చేసిన ఈ వీడియోలో.
రోడ్డుపై వాహనాలు కూడా తిరుగుతున్నాయి.ఈ క్రమంలో ఓ బబూన్ కోతుల గుంపు రోడ్డుపైకి వచ్చింది.
దీంతో రోడ్డుకు అటువైపు ఇటువైపు కార్లు ఆగిపోయాయి.రోడ్డుపై గుంపుగా బబూన్ కోతులు వెళ్తున్నాయి.
ఆ సమయంలో చిరుత పులి వాటిపై దాడిచేసేందుకు సిద్ధమైంది.చిరుత పులి తెలివిగా బబూన్ కోతుల గుంపులో వెనుకాల నడుస్తున్న చిన్న బబూన్ ఒక్కసారిగా దాడికి దిగడంతో అది గమనించిన బబూన్ కోతులు వెనకనుండి వచ్చి మరీ చిరుతపై ఒక్కసారిగా దాడికి దిగడంతో చిరుత తోకముడిచింది.