కోలీవుడ్ స్టార్ హీరో దళపతి( Hero Vijay Thalapathy ) విజయ్ జోసెఫ్ కు కోలీవుడ్ లో మాత్రమే కాదు మన తెలుగులో కూడా బాగానే ఫాలోయింగ్ ఉంది.అందుకే ఈయన సినిమాలు మన దగ్గర కూడా భారీ స్థాయిలోనే రిలీజ్ చేస్తుంటారు.
ఈ ఏడాది వారిసు సినిమాతో విజయం సాధించిన విజయ్ మరో సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.
మన హీరోలు ఏడాదికి ఒక సినిమాను కూడా పూర్తి చేయడం లేదు.కానీ విజయ్ ఒకటి పూర్తి కాగానే మరొకటి స్టార్ట్ చేస్తూ ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడు.ఇక సంక్రాంతి సీజన్ ను కబ్జా చేసిన విజయ్ ఈసారి దసరా బరిలో ”లియో”( Leo ) సినిమాతో ఉండబోతున్నాడు.
ఈ సినిమా వచ్చే నెల గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Director Lokesh Kanagaraj ) దర్శకత్వంలో ‘లియో’ సినిమా తెరకెక్కగా స్టార్ హీరోయిన్ త్రిష విజయ్ కు జోడీగా నటిస్తుంది.
సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్( Anirudh Ravichadnran ) సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుని అంచనాలు పెంచేసింది.మరి ఇప్పుడు సెకండ్ సింగిల్( Leo Second Single ) రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.ఇప్పటికే ప్రోమో రిలీజ్ చేయగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయనున్నారు.మిస్టర్ లియో దాస్ అంటూ సాగే ఈ సాంగ్ ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.