టెక్నాలజీలో భాగంగా లెనోవో కంపెనీ సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆశ్చర్య పరుస్తూనే ఉంది.టెక్నాలజీ విషయంలో కంపెనీలు పోటీ పడుతున్న వేళ గత సంవత్సరం లెనోవో కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో లో థింక్ బుక్ ప్లస్ జెన్ 3 నీ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ బ్రాండ్ ని భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది.ఈ ల్యాప్‌టాప్‌లో రెండు డిస్ప్లే లు ఉంటాయి.ఎంటర్ ప్రైజ్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని రూపొందించింనదే ఈ హై – ఎండ్ ల్యాప్‌టాప్.
21:10 అల్ట్రా వైడ్ రేషియో,17.3 అంగుళాల డిస్ప్లే కలిగి ఉన్న మొదటి ల్యాప్‌టాప్ ఇదే.3k రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 99% DCI-p3, 400 nits తో ఉంది.ఈ ల్యాప్‌టాప్‌లో కీబోర్డుకు పక్కన సెకండ్ స్క్రీన్ ఉంటుంది.సెకండరీ డిస్ప్లే HD+ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్, 350 nits పీక్ బ్రైట్నెస్, 60% NTSC కలర్స్,టచ్ సపోర్ట్ తో కూడిన 8 అంగుళాల పరిమాణంలో ఉంటుంది.

ఇందులో ఫోన్లో ఉపయోగించే అన్ని రకాల ఫీచర్స్ వినియోగించుకోవచ్చు.ఈ ల్యాప్‌టాప్‌లో డాల్బీ ఆట్మోస్ కు మద్దతుగా డ్యూయల్ 2 W హర్మాన్ కార్డాన్ పవర్డ్ స్టీరియో స్పీకర్లు ముందు భాగంలో అమర్చబడి ఉంటాయి.ఇది 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ తో అమర్చబడి, ఇంటిగ్రేటెడ్ ఐరిస్ Xe గ్రాఫిక్స్ అండ్ బోర్డుతో జత చేయబడింది.ఇందులో 16GB LPDDR5 RAM, 1TB SSD స్టోరేజ్ ఉంటుంది.

పైగా 32GB మరియు 2TB వరకు అప్ గ్రేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.70Wh బ్యాటరీతో 100W వేగంగా చార్జింగ్ అవుతుంది.ఇది USB-C థండర్ బోల్ట్ 4 పోర్ట్, USB-C పోర్ట్, USB-A పోర్ట్, HDMI పోర్ట్, 3.5 mm జాక్, Wi-Fi 6E, 5.2 బ్లూటూత్ వెర్షన్ వంటి ఆప్షన్లతో కూడి, విండోస్ 11 ప్రో OS లో పనిచేస్తుంది.మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.1,94,990 తో మొదలవుతుంది.కంపెనీ వెబ్ సైట్ లోనే కాక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ అవుట్ లెట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.







