కాంగ్రెస్ పార్టీలో లీడర్లకు కొదవ లేదు..: జగ్గారెడ్డి

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్( KCR ) చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి( Jaggareddy ) కౌంటర్ ఇచ్చారు.కేసీఆర్ బయటకు వస్తే తమ అస్త్రాలు తాము బయటకు తీస్తామని తెలిపారు.

 Leaders In Congress Party Have Nothing To Do Jaggareddy Details, Jaggareddy, Con-TeluguStop.com

ప్రభుత్వం కూలిపోతుందని ఏ ఆలోచనతో అన్నారో కేసీఆర్ కే తెలియాలని జగ్గారెడ్డి అన్నారు.ఏ పార్టీ ఎమ్మెల్యే ఎవరితో టచ్ లో ఉన్నారో ఎన్నికలు పూర్తయిన తరువాత తెలుస్తుందని చెప్పారు.

ఈ క్రమంలోనే కేసీఆర్ ఏం చేసినా ఎలా తిప్పికొట్టాలో తమకు తెలుసని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు.

కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలో లీడర్లకు కొదవ లేదన్నారు.బీఆర్ఎస్ లో ముగ్గురు, బీజేపీలో ఇద్దరు మాత్రమే నాయకులు ఉన్నారని విమర్శించారు.బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో మోదీ, అమిత్ షాకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube