సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో డబ్బు గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.డబ్బులు ఖర్చు పెట్టడం గురించి మా కుటుంబం అలోచిస్తుందని చెబితే మా కుటుంబం గురించి నేనే బయట పెట్టుకున్నట్టు ఉంటుందని పేర్కొన్నారు.
మా కమ్యూనిటీలో ఎక్కువ శాతం మందికి మనీ మైండ్ ఉంటుందని లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చారు.
తారకరత్న ఆస్పత్రిలో ఉన్న సమయంలో మాత్రం విజయసాయిరెడ్డి గారు అండగా నిలిచారని ఆమె కామెంట్లు చేశారు.
అలేఖ్యారెడ్డి తండ్రి అలేఖ్య కోసం విల్లా కొనిచ్చారని కొంత డబ్బు ఇచ్చారని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు.ఈ విషయాలు నాకు ఇంతకు ముందే తెలుసని ఆమె తెలిపారు.
తారకరత్న పిల్లలకు ఏమి ఇస్తారో అని చూస్తూ ఉన్నామని ఆమె కామెంట్లు చేశారు.ఆ ముగ్గురు పిల్లలు నందమూరి వారసులే అని వాళ్లకు న్యాయం చేయాల్సిన బాధ్యత నందమూరి కుటుంబంపై ఉందని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.

బాలకృష్ణ పెద్ద మనిషిగా నిలబడి ఆస్తుల విషయంలో న్యాయం చేస్తే బాగుంటుందని ఆమె అన్నారు.ఎక్కడున్నా మేము నందమూరి వాళ్లమేనని ఆమె కామెంట్లు చేశారు.నందమూరి కుటుంబంలో ఎవరితో కూడా మాటల్లేవని లక్ష్మీపార్వతి అన్నారు.వ్యక్తిగతంగా మోహనకృష్ణ మంచివాడని లక్ష్మీపార్వతి తెలిపారు.1982లో సీనియర్ ఎన్టీఆర్ ఏమీ ఉంచుకోకుండా పిల్లల పేర్లపై ఆస్తులు రాసేశారని ఆమె అన్నారు.

సీనియర్ ఎన్టీఆర్ కొడుకులందరికీ ఇళ్లు కట్టించి ఇచ్చారని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.ముఖంలో కళ అనేది ముఖ్యం అని లక్ష్మీపార్వతి తెలిపారు.మా ఆయనకు నచ్చిన అందం నాలో ఉందని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.
లక్ష్మీ పార్వతి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.లక్ష్మీపార్వతి కామెంట్లపై నందమూరి ఫ్యామిలీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.







