అందాల రాక్షసి.ఈ పేరు వినగానే అందరికి గుర్తుకు వచ్చే హీరోయిన్ లావణ్య త్రిపాఠి.
ఈమె అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన ఈమె స్టార్ హీరోయిన్ అవుతుంది అని అంతా అనుకున్నారు.
కానీ ఈమె స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేక పోయింది.అయితే ఈమెకు మధ్యలో కొన్ని హిట్స్ వచ్చాయి కానీ అవి ఈమె కెరీర్ కు మాత్రం ఏ మాత్రం సహాయ పడలేదు.
గత ఏడాది ఈ బ్యూటీ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈమె బ్యాక్ టు బ్యాక్ ప్లాపులను మాత్రమే చవిచూడాల్సి పరిస్థితి ఏర్పడింది.గత ఏడాది ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా సినిమాలలో ఈ అమ్మడు నటించింది.అయితే ఈమె నటించిన రెండు సినిమా ప్లాప్ అయ్యాయి.
దీంతో ఈ అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి.కానీ రాకరాక లావణ్య కు ఒక అవకాశం వచ్చింది.
కానీ ఈసారి కూడా ఈమెకు ప్లాప్ నే ఎదురయ్యింది.గత ఏడాది రెండు ప్లాపులు రాగా ఇక ఇప్పుడు నటించిన మరొక సినిమా కూడా ప్లాప్ నే అయ్యింది.లావణ్య త్రిపాఠి నటించిన హ్యాపీ బర్త్ డే సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాపై ఈ అమ్మడు చాలా హోప్స్ పెట్టుకుంది.
కానీ అవన్నీ ఈ సినిమా కూడా తీర్చలేదు.దీంతో ప్లాపుల్లో హ్యాట్రిక్ కొట్టింది.
మన ఇండస్ట్రీలో ఒక్క ప్లాప్ ఎదురైతేనే మరొక అవకాశం రావడానికి చాలా సమయం పడుతుంది.అలాంటిది ఇప్పుడు ప్లాపుల్లో ఏకంగా హ్యాట్రిక్ కొట్టింది.
దీంతో మరో అవకాశం రావడం కష్టమే అంటున్నారు.అయితే ఈమెకు ఇండస్ట్రీలో ఉన్న పరిచయాల కారణంగా మరికొన్నేళ్ల పాటు తన కెరీర్ ను కంటిన్యూ చేయగలిగే సత్తా కూడా ఉంది అని మరో టాక్ వినిపిస్తుంది.
చూడాలి మరి ఈ అమ్మడి కెరీర్ ఎంత వరకు ముందుకు సాగుతుందో.