Vishal Abhinaya: అభినయతో పెళ్లిపై స్పందించిన విశాల్.. అందరిని పిలుస్తానంటూ?

సోషల్ మీడియాలో నిత్యం ఎవరో ఒక సెలబ్రిటీ కి సంబంధించిన రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి.సినీ ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కాస్త చనువుగా ఉన్నారు అంటే చాలు వారిద్దరి మధ్య ఏదో నడుస్తోందని వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు ఇలా అనేక రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.

 Lathi Movie Event Vishal Clarity On His Marriage With Abhinaya Details, Vishal,-TeluguStop.com

ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు ఇలా వారి విషయాల్లో వచ్చిన వార్తలను ఖండిస్తూ అవన్నీ అబద్ధాలే అంటూ కొట్టి పారేసిన విషయం తెలిసిందే.కొంతమంది ఎవరు ఎన్ని విధాలుగా రాసిన కూడా వారి పని వారు చేసుకుంటూ అలాంటి వార్తలను పట్టించుకోకుండా వెళుతూ ఉంటారు.

కాగా గత కొద్దిరోజులుగా హీరో విశాల్ పెళ్లికి సంబంధించిన వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.హీరో విశాల్ నటి అభినయను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో విశాల్ నిశ్చితార్థం చేసుకుని ఆ తర్వాత పెళ్లిని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం విశాల పరస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొకవైపు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.ఈ క్రమంలోనే తాజాగా తన పెళ్లిపై వస్తున్నారు రూమర్లకు చెక్ పెట్టేశారు హీరో విశాల్.

అదేవిధంగా నటి అభినయతో తన పెళ్లి విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు.

హీరో విశాల్ తాజాగా నటించిన చిత్రం లాఠీ. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించారు చిత్ర బృందం.ఈ ఈవెంట్ లో భాగంగా హీరో విషయాలు మాట్లాడుతూ తన పెళ్లి పై వస్తున్న వార్తలు గురించి స్పందించాడు.

నటి అభినయనం మీరు పెళ్లి చేసుకోబోతున్నారట కదా అని యాంకర్ ప్రశ్నించగా.ఆ విషయంపై స్పందించిన విశాల్ ప్రతి విషయానికి ఒక టైం వస్తుంది.నేను మాట ఇస్తే తప్పను.మాట పూర్తయ్యే వరకు వెనకడుగు వేసేదే లేదు.

ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ పూర్తి అయిన తర్వాత వచ్చే తొలి ముహూర్తంలో నా పెళ్లి జరుగుతుంది.500 కుటుంబాలు ఆ థియేటర్ ఆర్టిస్టులు 30 సంవత్సరాల ముందు వారి జీవితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు.ఇప్పటికీ నాటకాలు డ్రామాలు వేస్తున్నారు.వాళ్లు బాగుండాలి అని మా టీం ఈ ప్రయత్నం చేస్తోంది.ఆ బిల్డింగ్ పూర్తి అయిన తర్వాత నేను అందర్నీ పిలుస్తాను అలాగే నా పెళ్ళికి కూడా మీరందరిని పిలుస్తాను అని విశాల్ తెలిపారు.కానీ అభినయ పేరును మాత్రం ప్రస్తావించలేదు హీరో విశాల్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube