తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు జగపతిబాబు ( Jagapathi Babu ) ఒకరు.ఇక ఈయన ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలను చేశారు.
ఇలా కుటుంబ కథా చిత్రాలలో నటిస్తూ ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ని సంపాదించుకున్నటువంటి జగపతిబాబుకి క్రమక్రమంగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.అవకాశాలు తగ్గిపోవడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి జగపతిబాబు తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే ప్రస్తుతం విలన్ పాత్రలలోను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా జగపతిబాబు కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారనే సంగతి మనకు తెలిసిందే.
మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఇలా టాలీవుడ్ అనే కాకుండా ఇతర భాష చిత్రాలలో కూడా నటిస్తూ హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి జగపతిబాబుకి హాలీవుడ్( Hollywood ) సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి జగపతిబాబు వ్యక్తిగత విషయానికి వస్తే.
జగపతిబాబు కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములకు ఎవరికీ కూడా మగ పిల్లలు లేరట.ఈయనకి కూడా ఇద్దరు ఆడపిల్లలు కావటం గమనార్హం.ఇలా తన తండ్రి తన కొడుకులకు ఒకరికి కూడా వారసులు లేకపోవడంతో వారసులు లేరని చాలా ఫీల్ అయ్యేవారట.
ఇక మీకు అలాంటి ఫీలింగ్స్ లేవా అనే ప్రశ్న జగపతిబాబుకి ఎదురవడంతో నేనెప్పుడూ కూడా కొడుకులేరే అని బాధపడిన క్షణాలు తనకు లేవని ఎప్పుడూ కూడా బాధపడలేదని తెలిపారు.కొడుకులు ఉంటేనే హీరోలుగా పరిచయం చేయాలని లేదని కూతుర్లను కూడా హీరోయిన్స్ గా తన వారసులుగా పరిచయం చేయొచ్చు అంటూ జగపతిబాబు తెలిపారు.
ఇప్పటికే ఎంతోమంది అమ్మాయిలు హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అయితే మా అమ్మాయిలకు సినిమాలంటే ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని ఒకవేళ వాళ్ళు హీరోయిన్స్ గా నటిస్తాము అని చెప్పి ఉంటే తప్పకుండా నేను ఇండస్ట్రీలోకి వారిని తీసుకువచ్చే వాడిని అంటూ జగపతిబాబు తెలిపారు.ఇక మా నాన్నకి వారసులు లేరు అనే ఫీలింగ్ ఎక్కువగా ఉండేదని తరచూ నా దగ్గర ఇదే విషయం ప్రస్తావిస్తూ ఉంటే ఇప్పుడేంటి వారసులు లేకపోతే ఎవరైనా తెచ్చుకొని పెంచమంటావా అంటూ తనని అడిగానని జగపతిబాబు తెలిపారు.ఇలా ఎవరినైనా దత్తత తీసుకుంటాను అన్నా కాని మా నాన్న వద్దని చెప్పారు అంటూ జగపతిబాబు తెలియజేశారు.
ఇక ఈయన త్వరలోనే ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన సలార్( Salaar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.