రాధేశ్యామ్ తో ఫ్రీ పబ్లిసిటీ.. ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న పోస్టర్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.వాటిల్లో రాధేశ్యామ్ ఒకటి.

 Latest News On Radheshyam , pooja Hegde , Prabhas , Radhakrishna , Radhe Shyam-TeluguStop.com

రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ప్రభాస్ ను వెండి తెర మీద చూడక దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది.

అందుకే రాధేశ్యామ్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూసారు.

Telugu Publicity, Hegde, Posters, Pooja Hegde, Prabhas, Prerana, Radhakrishna, R

ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఈ సినిమా మార్చి 11న రిలీజ్ అయ్యింది.ఈ సినిమా ముందు ప్రమోషన్స్ బాగా చేసి ప్రేక్షకులకు మరింత దగ్గర చేసారు.ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.అయితే విజువల్ వండర్ అంటూ ప్రేక్షకులు ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు.

అయితే ప్రేక్షకుల నుండి మాత్రం మిశ్రమ స్పందన రాలేదు.టాక్ విషయం పక్కన పెడితే ఈ సినిమా పోస్టర్స్ మరియు స్టిల్స్ తో తెలంగాణ ఆర్టీసీ మాత్రం ఫ్రీ పబ్లిసిటీ చేసుకుంటుంది.

అందుకోసం ఆయన షేర్ చేసిన ఒక మీమ్ ఇప్పుడు ఆకట్టుకుంటుంది.ఈ పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఈ పోస్టర్ లో హీరో హీరోయిన్ అయినా విక్రమాదిత్య, ప్రేరణ కూర్చుని ఉన్న స్టిల్ ఇది.

Telugu Publicity, Hegde, Posters, Pooja Hegde, Prabhas, Prerana, Radhakrishna, R

చాలా రోజులు అయ్యింది కదా ఎక్కడికైనా వెళదామా అంటూ హీరో అడగగా వెళదాం కానీ బస్సులోనే వెళదాం అంటూ హీరోయిన్ జవాబు ఇచ్చింది.ఎందుకు బస్సులోనే అంటూ హీరో ప్రశ్నించగా ఎందుకంటే ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం మరియు సుఖమయం అంటూ హీరోయిన్ సమాధానం చెబుతుంది.చివరగా బస్సే క్షేమం అంటున్న రాధేశ్యామ్ అంటూ చివర్లో క్యాప్షన్ కూడా ఇచ్చి పబ్లిసిటీ మొదలు పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube