కీర్తి సురేష్.ఈమె సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చింది.
హీరోయిన్ మేనక, మలయాళ నిర్మాత సురేష్ కుమార్ ముద్దుల కూతురు కీర్తి.తన సహజమైన నటనతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది ఈ మహానటిఈమె ఫస్ట్ సినిమాలో హిట్ కొట్టిన ఈమె నటనకు పెద్దగా పేరు రాలేదు.
కానీ కీర్తి సురేష్ మహానటి సినిమా చేసిన తర్వాత మాత్రం ఈమెను తెరమీద ఎవ్వరు చూడలేదు.మహానటి సావిత్రి గారినే ఉహించు కున్నారు.
ఈ సినిమాతో జాతీయ పురస్కారం అందుకుని జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఈ సినిమా తోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
వరుస అవకాశాలు కూడా ఈ అమ్మడిని వరించాయి.అయితే ఆ తర్వాత నుండి ఈమె ఎంచుకునే పాత్రల కారణంగా కెరీర్ గాడి తప్పింది.
ఈమె చేస్తున్న సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ అవుతూ వస్తున్నాయి.ఈమె మహానటి తర్వాత కూడా మహిళా ప్రధాన పాత్రలనే ఎంచుకుంటూ ప్లాప్ లను ఎదుర్కొంటుంది.
పెంగ్విన్, గుడ్ లక్ సఖి వంటి సినిమాలు ప్లాప్ లను మూటగట్టుకున్నాయి.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాట ఈమెను ఆదుకుంది అనే చెప్పాలి.ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో ఇప్పుడు కీర్తి సురేష్ మునుపటి కంటే మరింత జాగ్రత్తగా ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటుంది.ఈమెకు అవకాశాలు లేక కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోవడం లేదు అని రూమర్స్ వస్తున్న నేపథ్యంలో ఈమె ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యలతో ఆ రూమర్స్ కు చెక్ పడింది.

వేగంగా సినిమాలు చేయాలని అస్సలు లేదు.నాకు కథ, పాత్ర నచ్చితేనే సైన్ చేస్తాను.పది సినిమాలు చేయడం కంటే ఒక్క మంచి సినిమా చేసిన చాలు ప్రేక్షకులు ఎక్కువ రోజులు గుర్తుంచు కుంటారు.మిగిలిన హీరోయిన్ లతో నేను పోటీ పడాలని అనుకోవడం లేదు.
సినిమాలు ఒప్పుకోవడంతో నా స్టైల్ నాకు ఉంటుంది.అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు తన ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని ఇచ్చాయి.
వారు కూడా ఎప్పటి నుండో కీర్తి నుండి ఇలాంటి ఒక మార్పు కోరుకుంటున్నారు.ఈ వ్యాఖ్యలతో కీర్తిని ఒప్పించడం అంతా వీజీ కాదు అని తేలిపోయింది.

ఇక ప్రెసెంట్ కీర్తి చేతిలో రెండు తెలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.భోళా శంకర్ లో నటిస్తుంది.మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు కు చెల్లెలి పాత్రలో కీర్తి నటిస్తున్నట్టు ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.అలాగే నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాలో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తుంది.







