Surekha Vani : సురేఖ వాణి సుప్రీతకు ఉన్న ఈ చెడు అలవాటు తెలుసా.. అసలు విషయం చెప్పిన నటి?

సురేఖ వాణి ( Surekha Vani ) పరిచయం అవసరం లేని పేరు.ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Latest News About Supritha And Surekha Vani-TeluguStop.com

ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి ఈమె ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించారు అయితే తన కూతురు సుప్రీత( Supritha ) తో కలిసి సోషల్ మీడియాలో చేసే హంగామా మాత్రం మామూలుగా ఉండదని చెప్పాలి.

సుప్రీత ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టలేదు.

అయినప్పటికీ ఈమెకు హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది.ఇలా ఈ తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ వల్ల వీరికి అభిమానులు భారీగా పెరిగిపోయారు.

ఇద్దరు అక్కచెల్లెళ్ళు మాదిరి పొట్టి పొట్టి దుస్తులు వేసుకొని పబ్ లు, పార్టీలు వెకేషన్ లు అంటూ సందడి చేస్తూ ఉంటారు.ఇలా వీరికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకోవడంతో వీరికి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఇక పోతే సుప్రీత ఇటీవల బిగ్ బాస్ రన్నర్ అమర్ ( Amar ) హీరోగా రాబోతున్నటువంటి సినిమాలు హీరోయిన్గా అవకాశం అందుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది ఈ షూటింగ్ కి సంబంధించిన సన్నివేశాలను సుప్రీత అలాగే సురేఖ వాణి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా వీరికి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది.సుప్రీతకు కోపం వస్తే ఏం చేస్తారు అనే ప్రశ్న ఒక యూట్యూబర్ సురేఖ వాణిని అడిగారు.

ఈ ప్రశ్నకు సురేఖ వాణి సమాధానం చెబుతూ ఆ క్షణం తన చేతిలో మొబైల్ ఫోన్ ఉన్న లేదా గ్లాసులు ఉన్న అవి పగలబడును అంటూ సమాధానం చెప్పారు.తనకు కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేనని చేతిలో ఏ ఉన్న కచ్చితంగా పగిలిపోవాల్సిందేనంటూ సుప్రీత కూడా తనలో ఉన్నటువంటి ఈ చెడు అలవాట్లను తెలియజేశారు.మనకు ఆవేశం వచ్చినప్పుడు వస్తువులను పగలగొడుతూ ఉంటాము కానీ ఆవేశం కాస్త చల్లబడిన తర్వాత మనం చేసిన తప్పును తెలుసుకొని బాధపడుతూ ఉన్నప్పటికీ చాలామంది ఈ అలవాటును మార్చుకోరు తాను కూడా అలాంటి ధోరణిలోకి వస్తానని తెలిపారు.

ఇకపోతే కోపం వస్తే నన్ను వచ్చి గట్టిగా కొరుకుతుంది.అదేంటి అని అడిగితే ముద్దొచ్చావు అందుకే కొరుకుతున్నాను అంటూ సమాధానం చెబుతుందని తెలిపారు.అదేవిధంగా నన్ను ఇలా పట్టుకొని ఈ వైపు నుంచి ఆ వైపుకు తోస్తూ ఉంటుందని సుప్రీతలో ఉన్నటువంటి కొన్ని అలవాట్లు గురించి ఈ సందర్భంగా సురేఖ వాణి చెప్పడంతో పలువురు నెటిజన్స్ అదేదో గొప్ప లక్షణాలని,, గొప్ప గొప్ప అలవాట్లు ఉన్నాయని ఇలా చెప్పుకోవడం ఏంటి అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

https://www.facebook.com/reel/255591457488156

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube