Sreeleela Krithi Shetty : పాపం ఈ హీరోయిన్లు.. చూస్తే ముద్దొస్తారు.. కానీ ఏం చేస్తాం.. చిన్న వయసులోనే అన్నీ కష్టాలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి చిన్న వయసులోని హీరోయిన్లుగా అడుగుపెట్టి కెరియర్ మొదట్లోనే ఎంతో మంచి సక్సెస్ అత్తకు ఉన్నటువంటి వారిలో నటి శ్రీ లీల ( Sreeleela )అలాగే కృతి శెట్టి( Kriti Shetty )ఒకరు.కృతి శెట్టి అతి చిన్న వయసులోనే ఉప్పెన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

 Latest News About Heroine Sreeleela And Kriti Shetty-TeluguStop.com

ఈ సినిమా తర్వాత ఈమె శ్యామ్ సింగరాయ్.( Shyam Singha Roy ).అనంతరం బంగార్రాజు( Bangarraju ) సినిమాలలో నటించే వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలను సొంతం చేసుకున్నారు.

ఇలా ఈమె నటించిన వరుస మూడు సినిమాలు ఎంతో మంచి సక్సెస్ కావడంతో తనకు తదుపరి సినిమా అవకాశాలు వచ్చాయి.అయితే ఈమె నటించిన తదుపరి మాచర్ల నియోజకవర్గం దివారియర్ కస్టడీ సినిమాలు వరుసగా డిజాస్టర్ కావడంతో ఈమె కెరియర్ పై కోలుకోలేని ఎఫెక్ట్ పడింది దీంతో ప్రస్తుతం ఈమె సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారని చెప్పాలి.అయితే ఈమె బాటలోనే నటి శ్రీ లీల కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈమెకు కూడా కెరియర్ మొదట్లో వరుస సినిమాలు హిట్ కావడంతో ఒక్కసారిగా ఈమెకు తెలుగులో డజనుకు పైగా సినిమా అవకాశాలు వచ్చాయి.

ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది అనంతరం స్కంద సినిమా( Skanda ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది అయితే భగవంత్ కేసరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమా ద్వారా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాని అందుకున్నారు.ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఇలా ఈమెకు కూడా వరుసగా ఫ్లాప్ సినిమాలు రావడంతో మీమర్స్ భారీ స్థాయిలో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.

ఫ్లాప్స్ వచ్చాయా నీ భవిష్యత్తు నాకు అర్థం అవుతుంది అంటూ శ్రీ లీలను ఉద్దేశించి కృతి శెట్టి అన్నట్టు ఈ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈమె కూడ కృతి శెట్టి తరహాలోనే సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చారు.అయితే శ్రీ లీల ప్రస్తుతం ఎంబిబిఎస్ చదువుతున్నటువంటి నేపథ్యంలో తన ఎగ్జామ్స్ కారణంగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారనే చెప్పాలి.ఇక ఈమె నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ( Extra Ordinary Man )డిసెంబర్ 8వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అయితే వీరిద్దరు కూడా ఇండస్ట్రీలోకి అతి చిన్న వయసులోనే వచ్చి ఎంతో మంచి విజయాలను అందుకొని అనంతరం వరుసగా ఫ్లాప్స్ ఎదుర్కొంటున్నారు.ఇలా ఈ హీరోయిన్స్ కి వచ్చినటువంటి కష్టం మరెవరికి రాకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక శ్రీ లీల ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాతో హిట్ కనుక కొట్టకపోతే ఈమె కెరియర్ కూడా కాస్త ఇబ్బందులలో పడుతుందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube