ప్రజలు చేసే పాపాల వల్ల వర్షాలు పడడం లేదు.. పాపం చేసిన పుణ్యం చేసిన మీకే..!

ముఖ్యంగా చెప్పాలంటే లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు( Lal Darwaja Bonalu ) వైభవంగా జరిగాయి.

ఈ ఉత్సవాలలో భాగంగా జూలై 17వ తేదీ సోమవారం లాల్ దర్వాజా సింహ వాహిని మహంకాళి దేవాలయం దగ్గర రంగం కార్యక్రమము( Rangam ) ఘనంగా జరిగింది.

ఇందులో భాగంగా అనురాధ( Anuradha ) పచ్చి కొండ పై నిలబడి భవిష్యవాణి వినిపించారు.అంతేకాకుండా భక్తుల పూజల పై సింహ వాహిని మహంకాళి అమ్మవారు సంతృప్తి వ్యక్తం చేశారు.

అలాగే భక్తుల పూజలను ఆనందంతో అందుకున్నట్లు తెలిపారు.భక్తులకు ఎవరికి ఏమి కాకుండా చూసుకుంటానని అమ్మవారి అభయం ఇచ్చారు.అయితే వర్షాలు( Rains ) ఆలస్యానికి భక్తులు చేసే పాపాలే కారణమని తెలియజేశారు.

ముఖ్యంగా చెప్పాలంటే ప్రజలు చేసే పాపాల వల్ల ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయని అమ్మవారు తెలిపారు.ఇంకా చెప్పాలంటే ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలని అమ్మవారి సూచించారు.ఏం జరగకుండా చూసుకుంటానని అమ్మ వారు సెలవిచ్చారు.

Advertisement

భక్తులు( Devotees ) ఎక్కడి నుంచి కోరికలు కోరుకుని మొక్కులు చెల్లించుకున్న వారి కోరికలను నెరవేరుస్తానని అమ్మవారి తెలిపారు.పసుపు కుంకుమతో పూజలు నిర్వహించి కల్లుతో సాక పెడితే భక్తులను అడుగడుగునా కాపాడుకుంటానన్నారు.ముఖ్యంగా చెప్పాలంటే శాంతి పూజలు చేసిన తర్వాత ఆడపడుచులకు అన్ని విధాల మంచి చేస్తానని అమ్మవారి అభయం ఇచ్చారు.

అలాగే ఎవరి మనసులో ఏమన్నా తన దగ్గరికి వచ్చి పూజలు నిర్వహించి కోరికలు కోరుకుంటే వారి బాధలు తీరుస్తానని అన్నారు.ఎంత పుణ్యం పాపం చేసిన భక్తులకే సొంతమని మంచి కాలంలో మంచిగా నడుచుకున్నప్పుడే మంచి జరుగుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు