లక్ష్య రివ్యూ: లక్ష్యాన్ని పెట్టుకున్న నాగశౌర్యా హిట్ కొట్టినట్టేనా?

డైరెక్టర్ ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఈ రోజు విడుదలైన సినిమా లక్ష్య.ఈ సినిమాలో నాగ శౌర్య, కేతిక శర్మ నటీ నటులుగా నటించారు.

 Nagashourya Kethika Sharma Lakshya Movie Rating And Review Details, Lakshya , N-TeluguStop.com

అంతేకాకుండా జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్, రవి ప్రకాష్ తదితరులు కూడా నటించారు.ఆర్చరీ స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

ఇక ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస్ ఎల్ ఎల్ పి ప్రెజెంట్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ లు ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమాకు కథను కూడా సంతోష్ జాగర్లపూడి అందించాడు.

ఇక కాలభైరవ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించాడు.

ఇక ఈ సినిమా గత ఏడాది ప్రారంభం కాగా కరోనా కారణంతో చాలా వాయిదాలు పడ్డాయి.మొత్తానికి ఈ రోజు థియేటర్ లో విడుదలయ్యాయి.

కథ:

ఇందులో నాగశౌర్య పార్ధు అనే పాత్రలో ఆర్చరీ స్పోర్ట్స్ ప్లేయర్ గా నటించాడు.రవి ప్రకాష్ వాసు అనే పాత్రలో నాగశౌర్య తండ్రిగా ఆర్చరీ ప్లేయర్ గా నటించాడు.

వాసు వరల్డ్ ఛాంపియన్ కావాలన్న లక్ష్యంతో పోటీ కోసం వెళ్తుంటే కారు యాక్సిడెంట్లో మరణిస్తాడు.దీంతో పార్ధుకు ఈ ఆట మీద ఆసక్తి ఉండటంతో తన తాత రఘురామయ్య (సచిన్ ఖేడ్కర్) తెలుసుకొని అతనికి శిక్షణ ఇప్పిస్తాడు.

దాంతో పార్ధు స్టేట్ లెవెల్ ఛాంపియన్ గా నిలుస్తాడు.

Telugu Kethika Sharma, Jagapathi Babu, Lakshya, Lakshya Review, Lakshya Story, R

ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్ కోసం తన తండ్రి కోరిక తీర్చాలని అనుకుంటాడు.కానీ అంతలోనే తన తాత చనిపోవడంతో ఆ బాధను తట్టుకోలేక పోతాడు.ఎలాగైనా ఆటలో గెలవాలన్నా ఉద్దేశంతో మత్తు పదార్థాలను తీసుకుంటాడు.

ఆ తర్వాత ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు సస్పెండ్ చేస్తారు.దీంతో చివరికి పార్ధు వరల్డ్ ఛాంపియన్ గా ఎలా అవుతాడు అనేది, అంతలోనే జగపతిబాబు ఎలా పరిచయం అవుతారనేది, ఇక తన జీవితంలోకి కేతిక శర్మ ఎలా వస్తుంది అనేది మిగిలిన కథలో చూడవచ్చు.

Telugu Kethika Sharma, Jagapathi Babu, Lakshya, Lakshya Review, Lakshya Story, R

నటీనటుల నటన:

నాగ శౌర్య తన నటనతో మెప్పించాడు.ఇందులో నాగ శౌర్య ఏకంగా 8 ప్యాక్ తో బాగా ఆకట్టుకున్నాడు.హీరోయిన్ కేతిక కూడా బాగా నటించింది.జగపతి బాబు కూడా తన పాత్రలో లీనమయ్యాడు.చాలావరకు నటీనటులందరూ తమ పాత్రల్లో బాగా మెప్పించారు.

టెక్నికల్:

టెక్నికల్ పరంగా దర్శకుడు ధర్మేంద్ర సంతోష్ జాగర్లపూడి మంచి కథను తీసుకున్నాడు.పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకున్నాడు.ఇక కాస్త ఎంటర్టైన్మెంట్ ను యాడ్ చేస్తే బాగుండేది.

Telugu Kethika Sharma, Jagapathi Babu, Lakshya, Lakshya Review, Lakshya Story, R

విశ్లేషణ:

ఇందులో ఫస్టాఫ్ మొత్తం స్పోర్ట్స్ నేపథ్యంలోనే సాగుతుంది.ఇందులో చాలా వరకు ఎంటర్టైన్మెంట్ అనేది లేదు.సెకండాఫ్ కూడా అలాగే అనిపించింది.చాలావరకు దర్శకుడు ఎమోషనల్ ని మాత్రమే చూపించాడు.ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లకు ఈ సినిమా అంతగా ఆకట్టుకోదు.కానీ ఆట పరంగా బాగా ఆకట్టుకుంటుంది.

ప్లస్ పాయింట్స్:

నాగ శౌర్య నటన బాగా ఆకట్టుకుంది.ఎమోషనల్ సన్నివేశాలు బాగా టచ్ చేశాయి.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది.ఆర్చరీ ఆటతో రూపొందడం.

Telugu Kethika Sharma, Jagapathi Babu, Lakshya, Lakshya Review, Lakshya Story, R

మైనస్ పాయింట్స్:

ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటే ఇంకా బాగుండేది.అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు ఊహించని విధంగా ఉన్నాయి.

బాటమ్ లైన్:

ఈ సినిమా ఆర్చరీ ఆట నేపథ్యంలో ఎమోషనల్ గా సాగడంతో బాగానే ఆకట్టుకుంది.కొంతవరకు ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.ఎందుకంటే ఈ ఆట నేపథ్యంలో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా తెరకెక్కలేదు.

రేటింగ్: 2.5/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube