చనిపోయిన వారిని కొన్ని నిమిషాలు బ్రతికించే ఆలయం ఇదే.. ఎలా పూజించాలంటే?

సాధారణంగా చనిపోయిన వాళ్లను ఎవరైనా బ్రతికిస్తామని చెబితే వాళ్లను పిచ్చోళ్లను చూసినట్టు చూస్తారు.చనిపోయిన వాళ్లను బ్రతికించడం అసాధ్యమని వైద్యులు సైతం చెబుతారు.

అయితే చనిపోయిన వారిని కొన్ని నిమిషాలు బ్రతికించే ఆలయం( Temple ) ఒకటి ఉంది.వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా ఒక ఆలయం గురించి తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవడంతో పాటు నిజంగా ఇలా జరుగుతుందా అనే అభిప్రాయం కలుగుతుంది.

పరమశివుడు కొలువై ఉన్న ఈ ఆలయం డెహ్రాడూన్ జిల్లాలోని( Dehradun ) జాన్సర్ బవర్ అనే ప్రదేశంలో ఉంది.ఈ ఆలయంలోని దేవుడు చాలా పవర్ ఫుల్ అని కోరిన కోరికలను తీరుస్తాడని తెలుస్తోంది.

ఈ ఆలయం పురాతనమైన హిందూ ఆలయాలలో ఒకటి కాగా భక్తులు ఈ ఆలయాన్ని లఖ్ మండల మందిర్( Lakhmandal Mandir ) అని పిలుస్తారు.చక్రతా అనే ప్రాంతం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది.

Advertisement

అజ్ఞాతవాసం సమయంలో పాండవులు( Pandavas ) కొంతకాలం పాటు ఈ ప్రాంతంలో ఉన్నారని తెలుస్తోంది.ఈ ఆలయంలోని లింగం గ్రానైట్ తో చేసిన లింగం కావడం గమనార్హం.ఈ ఆలయంలో దానవ,( Danava ) మానవ( Manava ) అనే ప్రతిమలు ఉండగా ఈ ప్రతిమల వల్లే చనిపోయిన మనుషులు కొన్ని నిమిషాల పాటు తిరిగి బ్రతుకురారని తెలుస్తోంది.

భీముడు, అర్జునుడి ప్రతిమలు ఈ ఆలయంలో ఈ పేర్లతో ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

పరమశివుని పవిత్రమైన అభిషేక జలాన్ని ఎవరు తాగుతారో వాళ్లు కొన్ని నిమిషాల పాటు తిరిగి బ్రతుకుతారట.ఈ ఆలయంలోని శివుని శక్తి వల్లే చనిపోయిన వాళ్లు కొన్ని నిమిషాల పాటు జీవిస్తారని మరి కొందరు భావిస్తారు.ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిదని చెప్పవచ్చు.

రైలు, రోడ్డు, విమాన మార్గాల ద్వారా ఈ ఆలయాన్ని సులభంగా చేరుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్27, శుక్రవారం 2024
Advertisement

తాజా వార్తలు