లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) ప్రియుడు విఘ్నేష్ శివన్(Vignesh Sivan) ను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టిన విషయం తెల్సిందే.హీరోయిన్ గా ప్రస్తుతం ఆమె యొక్క కెరీర్ ఎంతో అద్భుతంగా సాగుతున్న సమయంలో పెళ్లి చేసుకోవడం ఏంటో అంటూ చాలా మంది విమర్శించారు.
కానీ ఆమె పెళ్లి తర్వాత కూడా అదే తరహా లో కెరీర్ ను కంటిన్యూ చేయాలని భావిస్తోంది.కేవలం బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే పెళ్లి తర్వాత కూడా స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు.
కానీ సౌత్ లో చాలా మంది హీరోయిన్స్ కనుమరుగవ్వడం లేదంటే పెద్దగా ప్రాముఖ్యత లేని పాత్రలు చేయడం.సగానికి పైగా పారితోషికం తగ్గించడం చేస్తున్నారు.
కనుక సౌత్ లో పెళ్లి అయిన హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు.పెళ్లి అయిన తర్వాత కూడా కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్ అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు.
వారిలో ముద్దుగుమ్మ నయనతార ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

హీరోయిన్ గా నయనతార తాజాగా లారెన్స్(Lawrence) హీరోగా రూపొందబోతున్న ఒక హర్రర్ సినిమాకు ఓకే చెప్పింది.ఆ సినిమా లో నటించేందుకు గాను నయనతార ఏకంగా మూడు కోట్ల రూపాయలను డిమాండ్ చేసిందని… విడుదల తర్వాత లాభాల్లో వాటాను కూడా సొంతం చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది.మొత్తానికి నయనతార పెళ్లి తర్వాత కూడా ఈ స్థాయి లో డిమాండ్ ఉండటం చూస్తూ ఉంటే ఇండస్ట్రీ లో ఆమె చాలా స్పెషల్ అంటూ అభిమానులు మరియు ఆమె సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ప్రచారం జరుగుతున్నాయి.ఈ సినిమా హిట్ అయితే కచ్చితంగా ముందు ముందు మరిన్ని సినిమాలతో ఈ అమ్మడు వచ్చే అవకాశం ఉంది.







