లేడీ సూపర్ స్టార్ గా సౌత్ ఇండియన్ సినీ ప్రేమికులు మరియు మీడియా వర్గాల వారు ఒకే ఒక్కరిని పిలుచుకుంటారు.ఆమె ఎవరో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఔను నయనతార( Nayanthara ) వన్ అండ్ ఓన్లీ లేడీ సూపర్ స్టార్ అనడం లో సందేహం లేదు.హీరోయిన్ గా ఆమె ఒక వైపు స్టార్ హీరో లకు జోడీగా నటిస్తూనే మరో వైపు ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమా లతో అదే స్టార్ హీరో లకు పోటీగా నిలుస్తుంది.

ఆ రేంజ్ లో సినిమా లు చేస్తూ కూడా స్టార్ డమ్ ఏమాత్రం తగ్గకుండా చూసుకున్న హీరోయిన్ నయనతార( Nayanthara ).సుదీర్ఘ ప్రేమ తర్వాత విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుంది.పెళ్లి చేసుకుని కూడా ఏడాది పూర్తి అయింది.పెళ్లి చేసుకున్న వెంటనే సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు.ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే అతి త్వరలోనే నయనతార సినిమా లకు గుడ్ బై చెప్పబోతున్నారట.పిల్లలు ఇద్దరు కూడా ఏడాది వయసుకు వచ్చారు.
ఇన్నాళ్లు వారి ఆలన పాలన చూసుకుంటూనే సినిమా ల్లో నటిస్తూ వచ్చింది.

కానీ ఇకపై అలా సాధ్యం కాదు.ఇద్దరు పిల్లలను చూసుకోవాలి అంటే కచ్చితంగా ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది.అందుకే ఒక తల్లిగా తాను వారికి పూర్తి సమయం కేటాయించాలని నయనతార భావిస్తుందట.అందుకే ప్రస్తుతం కమిట్ అయిన సినిమా లను పూర్తి చేసిన తర్వాత కొత్త సినిమా లకు కమిట్ అవ్వకూడదని నిర్ణయించుకుంది అంటూ తమిళ మీడియా లో కథనాలు వస్తున్నాయి.2025 నుంచి నయనతార కొత్త సినిమా లు ఉండబోవు అంటూ తమిళ మీడియా లో కుప్పలు తెప్పలుగా కథనాలు వస్తున్నాయి.కానీ ఆమె సన్నిహితులు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు.ఆమె నుంచి కానీ విఘ్నేష్ ( Vignesh Shivan _)నుంచి కానీ క్లారిటీ రాలేదు.ఆమె నుంచి క్లారిటీ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.ఆమె ఎప్పటికి క్లారిటీ ఇస్తుందో చూడాలి.
పిల్లలను చూసుకుంటూనే నయన్ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.మరి నయన్ ఉద్దేశ్యం ఏంటో చూడాలి.