కష్టానికి ప్రతిఫలం అందుకున్న కూలీ.. ఒక్క రాత్రిలోనే..!

అదృష్టం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు.ఇలాంటి సమయంలో మనకు ఒక సామెత కూడా గుర్తుకు వస్తుంది.

అది ఏంటంటే.అదృష్టవంతుడిని ఎవరు చెడగొట్టలేరు దురదృష్టవంతుడిని ఎవరు బాగు చేయలేరని అంటూ ఉంటారు.

ఇది సరిగ్గా నిజమే.ఒక వ్యక్తికి అదృష్టం వచ్చి తలుపు కొట్టి మరి పిలిచింది.

రాత్రికి రాత్రే అతడి లైఫ్ పూర్తిగా మారిపోయింది.అతడు అన్ని రోజుల నుండి పడుతున్న కష్టాన్ని ఒక్క రోజులోనే మర్చిపోయే అంత సంతోషం అతడికి వచ్చింది.

Advertisement
Labourer In Madhya Pradesh Find Diamond Worth 20 Lakh Details, Diamond,Madhyapra

ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.మధ్యప్రదేశ్ లోని పన్నా జిల్లా అనగానే అందరికి వజ్రాలు మాత్రమే గుర్తుకు వస్తాయి.

ఆ ప్లేస్ వజ్రాలకు అంత ఫేమస్.అక్కడ వజ్రాల గనులు ఉన్నాయి.

హీరాపూర్ తపరియన్ ప్రాంతంలో వజ్రాల గనులు ఎక్కువుగా ఉన్నాయి.ఆ ప్రాంతంలో ఎప్పుడు వందలాది మంది కూలీలు వజ్రాల కోసం తవ్వకాలు చేస్తూనే ఉంటారు.

ఇలా కూలీలా తవ్వకాల్లో వజ్రాలు దొరికితే వారికి అదృష్టం కలిగినట్లే.ఎందుకంటే ఆ వజ్రాల విలువ ఎంత పలుకుతుందో అంత ప్రభుత్వం కూలీలకే ఇచ్చేస్తుంది.

బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు

దీంతో వజ్రాలు దొరికిన కూలీ రాత్రికి రాత్రే లక్షాధికారి అవవడం ఖాయం.తాజాగా ఇలానే ఒక కూలీకి అదృష్టం కలిసి వచ్చింది.

Labourer In Madhya Pradesh Find Diamond Worth 20 Lakh Details, Diamond,madhyapra
Advertisement

తాను ఎప్పటి నుండి వజ్రాల వేటలో ఉన్నాడు.ఇన్నాళ్లు శ్రమించిన శ్రమ అంత ఒక్క రోజులోనే మర్చిపోయే విధంగా అతడికి అదృష్టం కలిసి వచ్చింది.ఇందులో పనిచేసే శంషేర్ ఖాన్ కు వజ్రాల గనిలో ఒక వజ్రం దొరికింది.

ఆ వజ్రం 6 క్యారెట్ల 66 సెంట్ల బరువు ఉంది.దీన్ని అతడు ప్రభుత్వానికి అందించాడు.

ఆ వజ్రాన్ని ప్రభుత్వం వేలం వేస్తుంది.ఆ వేలం పాటలో వచ్చిన డబ్బును కూలీలకు ఇచ్చేస్తుంది.

ఇక ఇతడి వజ్రం 20 లక్షల రూపాయలు పలికింది.దీంతో అతడి అదృష్టం తలపు తట్టి రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు.

తాజా వార్తలు