పెద్దోడివైపోయావ్ నాని

ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి సక్సెస్ కావాలనుకునేవారికి నాని ఇప్పుడు పెద్ద ఇన్సిపిరేషన్.

సీరియల్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలుపెట్టి, అమెరికాలో మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసే రేంజ్ కి ఎదిగాడు నాని.

కృష్ణగాడి వీరప్రేమగాథ నాని కెరీర్లో రికార్డు ఓపెనింగ్ కాకపోయినా, భలే భలే మొగాడివోయ్ వెనుక మారుతి ఉన్నట్టు ఈసారి ఎవరు లేరు నాని వనకాల.వచ్చిన ఓపెనింగ్స్ తన సొంత స్టామినానే.

ఇక కృష్ణగాడి వీరప్రేమగాథ శాటిలైట్ రెట్స్ మాత్రం నాని కెరీర్లో రికార్డు స్థాయిలో అమ్ముడుపోయాయి.ప్రముఖ టీవి ఛానెల్ జెమిని టీవి 4.10 కోట్లు పెట్టి ఈ చిత్ర ప్రసార హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.ఇంతకు ముందు భలే భలే మొగాడివోయ్ 3.50 కోట్లకు అమ్ముడుపోయింది.ఒక్కసారిగా ఇంత ఊపుని అందుకున్న నాని, ఇకనుంచి చాలా జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకోని, మంచి చిత్రాలని ఎంచుకోని తన రేంజ్ ఇంకా పెంచుకోవాలి .బ్యాక్ గ్రౌండ్ లేకున్నా ఇండస్ట్రీలో ఎత్తుకి వెళ్ళగలం అనే నమ్మకాన్ని కొత్తవారిలో కలిగించాలి.

Chiranjeevi : చిరంజీవికి ఆ ఇద్దరు హీరోయిన్స్ అంటే భలే ఇష్టమట..!
Advertisement

తాజా వార్తలు