కువైట్ తాజా ప్రకటనతో తెలుగు రాష్ట్రాల వలస వాసులకు భారీ ఊరట...

వలస కార్మికులకు పెట్టింది పేరు అరబ్బు దేశాలు.ముఖ్యంగా కువైట్ లో వలస కార్మికులు లెక్కకు మించి ఉంటారు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచీ కువైట్ వెళ్ళే వారి సంఖ్య పెద్దదే.తెలుగు రాష్ట్రాల తరువాత ఆస్థాయిలో కువైట్ కు వెళ్ళే వారిలో కేరళా వాసులు అత్యధికంగా ఉంటారు.అయితే కరోనా కారణంగా కువైట్ తమ దేశంలో ఉంటున్న వలస వాసులను తగ్గించుకునే క్రమంలో కొన్ని నిభందనలు అమలులోకి తీసుకువచ్చింది.60 ఏళ్ళు పై బడిన వలస వాసులను తమ దేశం నుంచీ వెళ్లగొట్టేందుకు కరోనా సమయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది.అయితే ఇప్పుడు ఆదేశాలు వెనక్కి తీసుకుంటూ తాజాగా మరో కీలక ప్రకటన చేసింది.

కరోనా సమయంలో కువైట్ వ్యాపారాలు, ఆర్ధిక వ్యవస్థలు కుప్ప కూలిపోయాయి.దాంతో ప్రభుత్వ , ప్రవైటు రంగాలలో పనిచేస్తున్న 60 ఏళ్ళు దాటిన వలస వాసులను బలవంతంగా పంపక తప్పలేదు.

పైగా స్థానికులు కరోన కారణంగా ఆర్ధిక కష్టాలు పడటంతో వలస వాసుల స్థానానల్లో స్థానికులకు ఉపాది కల్పించేందుకు ప్రణాలికలు సిద్దం చేసుకున్నాయి.అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ వ్యాపారాలు, ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవడంతో 60 ఏళ్ళు పైబడిన వారిపై విధించిన నిషేధాన్ని ఎత్తేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

దాంతో.నిషేధం విధించిన తరువాత కువైట్ నుంచీ వెళ్ళిపోయిన తెలుగు రాష్ట్రాలకు చెందిన 60 ఏళ్ళు పైబడిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మళ్ళీ తిరిగి కువైట్ రావడానికి ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు.ఇదిలాఉంటే తెలుగు రాష్ట్రాల నుంచీ కువైట్ వెళ్లి అక్కడ ఉపాది పొందుతున్న వారి సంఖ్య దాదాపు 3.50 లక్షల వరకూ ఉంటుందని, తెలుస్తోంది.కేవలం 60 ఏళ్ళు పైబడిన వారు మాత్రమే కాకుండా కరోనా కారణంగా ఉపాది కోల్పోయిన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసిన ఎంతో మంది తెలుగు వారు తిరిగి కువైట్ వెళ్ళడానికి సిద్దంగా ఉన్నారట.

Advertisement

తాజా వార్తలు