మన దేశంలో డయాబెటిస్ అత్యంత ఎక్కువగా పెరగడానికి అసలు కారణం అదే అంట.!

గాలి కాలుష్యం వల్ల డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం అధికమని, ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య పెరగడానికి గాలి కలుషితం కావడమేనని పరిశోధకులు పేర్కొన్నారు.మధుమేహం రావడానికి గల కారణాల్లో గాలి కాలుష్యం కూడా ఒకటని వెల్లడించారు.

 Diabetes, Sugar Patients, Reason Behind Diabetes Increase In India-TeluguStop.com

దీన్ని బట్టి చూస్తే భారత్‌ పెనుప్రమాదంలో ఉన్నట్లు అర్థం అవుతుంది.

కలుషితమైన గాలి మనిషిలో ఇన్సులిన్‌ ఉత్పత్తిపై ప్రభావం చూపుతోందని.రక్తంలోని గ్లూకోజ్‌ను శక్తిగా మారకుండా అడ్డుకుంటుందని పరిశోధనలో తేలింది.గాలి కాలుష్యం విషయంలో తక్కువ ఆదాయ దేశాల్లో ఎలాంటి ప్రత్యామ్నాయ పాలసీలు లేవని, దీంతో ఆయా దేశాల్లో ప్రజలు అత్యధికంగా గాలి కాలుష్యం వల్ల డయాబెటిస్‌ బారిన పడుతున్నారని గర్తించారు.

పర్యావరణ రక్షణ సంస్థ (ఈపీఏ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)లు కలిసి అతి తక్కువ కాలుష్యంగా గుర్తించిన ప్రదేశాల్లోనూ డయాబెటిస్‌ పెరిగిపోయిందని పరిశోధకులు తెలిపారు.2016లో గాలి కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల డయాబెటిస్‌ కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు.గాలి కాలుష్యం వల్ల 42 లక్షల మంది చనిపోయారని ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి గోల్స్‌ రిపోర్టు-2018లో పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube