మొదటి భర్తకు ఉద్యోగం ఇచ్చి ఇల్లు కూడా ఇచ్చాను.. సీనియర్ నటి కామెంట్స్ వైరల్?

ఒకప్పటి సీనియర్ నటి కుట్టి పద్మిని గురించి ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు కానీ, ఆ తరం ప్రేక్షకులు ఆమెను ఇట్టే గుర్తు పట్టేస్తారు.మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమె అప్పట్లో ఏ సినిమాలో చూసిన ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించేది.

 Kutty Padmini Says I Look After My First Husband When I Got Second Marraige Deta-TeluguStop.com

ఇకపోతే కుట్టి పద్మిని ప్రస్తుతం వైష్ణవి ఫిలింస్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ అనే బ్యానర్ ద్వారా సీరియల్స్ రూపొందిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తోంది.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు నేర్పించుకుంది.

కుట్టి పద్మిని తల్లి రాధ కూడా ఒకప్పుడు నటి.సావిత్రి, రాధ మంచి స్నేహితులు కావడంతో పద్మిని మూడు నెలల వయసులోనే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చారు.ఇదిలా ఉంది తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి పద్మిని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఈ సందర్బంగా ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.తనకు రెండు సార్లు పెళ్లి అయ్యిందని, మొదటి భర్త తాగుడుకు బానిస కావడంతో వేరు పడ్డామని చెప్పారు.

Telugu Actresskutty, Kutty Padmini, Kuttypadmini, Prabhu, Vishnavi-Movie

ఆ తర్వాత ప్రభు అనే వ్యక్తితో ప్రేమ వివాహం జరిగింది అని ఆమె చెప్పుకొచ్చింది.తనకు ఇద్దరు పిల్లలు జన్మించినట్లు ఆమె చెప్పుకొచ్చింది.అయితే తన మొదటి భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిసి ఆమెనె తీసుకువచ్చి తన ఆఫీసు కింద రూమ్ కట్టి తన మొదటి భర్తని చూసుకున్నట్టు తెలిపింది.

గత ఏడాదే అతను చనిపోయారు అని చెప్పుకొచ్చింది కుట్టి పద్మిని.మరొకరితో జీవితం పంచుకున్నాక,

Telugu Actresskutty, Kutty Padmini, Kuttypadmini, Prabhu, Vishnavi-Movie

మొదటి భర్తతో బెడ్ ను పంచుకోలేను కానీ, అలా వదిలేయాలని అనిపించలేదు.ఆఫీసులో ఉద్యోగం ఇచ్చి రూ.30 వేలు జీతం ఇచ్చామని తెలిపారు.అలాగే తన రెండవ భర్త ప్రభువు కొన్నాళ్లపాటు తనతో బాగానే కాపురం చేసి అనంతరం సెక్రటరీ తో లవ్ లో పడినట్లు ఆమె తెలిపింది.అయితే తాను వారందరి పెళ్లి చేయడానికి పిల్లలు మాత్రం అందుకు ఒప్పుకోలేదని, దానితో చివరికి ఆమెను విడిచిపెట్టి తన భర్త ప్రభు వెళ్లిపోయాడని తెలిపింది.

ప్రస్తుతం తాను ఒంటరిగా ఉన్నట్లు ఆమె తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube