హీరోయిన్ కుష్బూ ఏంటీ ఇలా తయారైంది..?

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన స్టాలిన్ చిత్రంలో చిరంజీవికి అక్క పాత్రలో నటించినటువంటి తమిళ బొద్దుగుమ్మ మరియు సీనియర్ హీరోయిన్ ఖుష్బూ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే.

అయితే ఈమె స్వతహాగా తమిళ సినీ పరిశ్రమకు చెందిన నటి అయినప్పటికీ తెలుగు, కన్నడ భాషలలో కూడా తన నటనతో తనకంటూ కొంతమంది అభిమానులని సంపాదించుకుంది.

అయితే తాజాగా నటి కుష్బూ కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ఇందులో కుష్బూ తనకు సంబంధించినటువంటి తాజా ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేసింది.

అయితే ఈ ఫోటోలను ఒకసారి పరిశీలించినట్లయితే ఎప్పుడూ బొద్దుగా కనిపించే ఖుష్బూ ఒక్కసారిగా బరువు తగ్గినట్లు తెలుస్తోంది.అంతేగాక ఖుష్బు కూడా ఈ విషయం గురించి స్పందిస్తూ తాను లాక్ డౌన్ సమయంలో వర్కౌట్లు చేసి దాదాపుగా 15 కిలోల వరకూ బరువు తగ్గానని స్పష్టం చేసింది.

దీంతో పలువురు అభిమానులు ఆమె ఫోటోలని సోషల్ మీడియాలలో తెగ వైరల్ చేస్తున్నారు.మరికొందరు మాత్రం తమకు ఇలా బరువు తగ్గి సన్నబడిన కుష్బూ కంటే బొద్దుగా ఉండేటువంటి కుష్బూ అంటేనే ఇష్టం అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా గత కొద్దికాలంగా నటి కుష్బూ తాను నటించే చిత్రాల కథల విషయమై ఆచి తూచి అడుగులు వేస్తోంది.కాగా ప్రస్తుతం తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్నటువంటి చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు