కుమారి ఆంటీ( Kumari Aunty ) పరిచయం అవసరం లేని పేరు.హైదరాబాదులో తన జీవనోపాధి కోసం ఎక్కడో ఫుట్ పాత్ దగ్గర ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ ఎంతోమంది ఆకలిని తీర్చుతూ తన పొట్ట నింపుకుంటున్నటువంటి కుమారి ఆంటీ ఇటీవల కాలంలో స్టార్ సెలబ్రిటీగా మారిపోయారు.
ఈమె ఫుడ్ స్టాల్ నడుపుతూ ఉండగా కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఆమెను ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.ఎంతలా ఫేమస్ అంటే చివరికి బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేసే అంత గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా సోషల్ మీడియాలో కూడా కుమారి ఆంటీకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.ఇప్పుడు ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారిపోయి సెలబ్రిటీ అయ్యింది.ఆమె తాజాగా డిజిటల్ మీడియా ఫ్యాక్టరీ( Digital Media Factory ) కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) వంటి స్టార్స్ హాజరయ్యారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వేదికపై కుమారి ఆంటీ మాట్లాడుతూ చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇలా వేదికపై కుమారీ ఆంటీ మాట్లాడుతూ నాకు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి.నాకు ఇలాంటి గుర్తింపు వస్తుందని నేను అసలు ఊహించలేదు అసలు నేనెక్కడుంటాను ఏం చేస్తాను అనే విషయాలు నాకే తెలియదు.ప్రపంచం ఎలా ఉంటుందో తెలియని నన్ను నేడు ఇక్కడికి తీసుకు వచ్చారు అంటే అదంతా కేవలం సోషల్ మీడియా పుణ్యమే అంటూ ఈమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
అంతేకాకుండా వేదికపైనే ఈమె జీవితంలో చదువులు లేకపోయినా ఆత్మవిశ్వాసం ఉంటే ముందుకు వెళ్లి.విజయం సాధించవచ్చు అంటూ ఒక ఇన్స్పిరేషన్ పద్యం పాడుతూ అందరిని ఆకట్టుకున్నారు.