షణ్ముఖుడు అంటే ఎవరు? ఆయన వాహనం ఏంటి?

షణ్ముఖుడు అనగా కుమార స్వామి.దీనికి అర్థం ఆరు ముఖాలు కలవాడని అర్థం.

అంతే కాదండోయ్ కుమార స్వామికి ఆరు తలలతో పాటు 12 చేతులు కూడా ఉంటాయి.ఆది దంపతులైన శివుడు , పార్వతుల కుమారుడే ఈ కుమార స్వామి.

వినాయకుడి అన్న.దేవతలందరకీ ఈయనే సేనాధిపతి.

కుమార స్వామకి కేవలం షణ్ముఖుడు అనే పేరు మాత్రమే కాదండోయ్.బ్రహ్మ జ్ఞానం తెలిసినందున సుబ్రహ్మణ్యుడుగా, కృతికా నక్షత్రంలో పుట్టినందున కార్తికేయుడుగా, రెల్లుగడ్డిలో అవతరించినందున శరవణుడుగా, పార్వతీ దేవి పిలిచినందున స్కందుడుగా, శూలాన్ని ఆయుధంగా వాడటం వల్ల వేలాయుధుడుగా పేర్లు వచ్చార్యి.

Advertisement
Kumara Swamy Special Sotry , Kumara Swami , Devotional , Shanmukudu , Subramanya

ఈయన వాహనం నెమలి.ఈయన బ్రహ్మచారి అని స్కంద పురాణంలో ఉంది.

Kumara Swamy Special Sotry , Kumara Swami , Devotional , Shanmukudu , Subramanya

కుమార స్వామి ఒక రోజు పిల్లిని గిల్లితే తన తల్లికి గాయమైందట.విషయం గ్రహించిన కుమార స్వామి అమ్మా నీకేమైందని అడిగాడు.స్పందించిన జగన్మాత ఈ ప్రపంచంలోని ప్రతీ ప్రాణిలో తాను ఉన్నానని చెబుతుంది.

తాను లేనిదే ఈ సృష్టి లేదని వివరిస్తుంది.నీవు పిల్లిని గిల్లడం వల్లే నా చెంపకు గాయమైందని తెలిపింది.

అది విన్న కార్తికేయుడు లోకంలోని ఏ ఒక్కరినీ బాధ పెట్టకూడదని నిర్ణయించుకున్నాడు.అలాగే అందరి అమ్మాయిల్లో తన తల్లి ప్రతి రూపం ఉంటుందని భావించి పెళ్లి కూడా చేసుకోకూడదు అనుకున్నాడు.

దర్శకుడిని ఓ రేంజిలో ఉతికారేసిన చంద్రమోహన్.. అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు..

అందుకే కుమార స్వామి ఎవరినీ పెళ్లి చేసుకోలేదు.బ్రహ్మచారిగా ఉండి పోయాడు.

Advertisement

తల్లి మాటకు అంత గౌరవం ఇచ్చే ఆ కుమార స్వామి.భక్తులు కోరిన కోర్కెలు కూడా వెంటనే తీర్చుతాడని ప్రతీతి.

.

తాజా వార్తలు