గుడివాడ లో కెటిఆర్ యూత్ పేరు తో బీఆర్ఎస్ ఫ్లేక్సీలు

టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ పేరుతో గుడివాడ లో భారీ కట్ అవుట్లు వెలిసాయి.

వెలమ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది యువత కేటీఆర్ యూత్ పేరుతో గుడివాడ పట్టణ ప్రధాన సెంటర్స్ వద్ద టీఆర్ఎస్ టూ బీఆర్ఎస్, జాతీయ పార్టీని ప్రారంభించిన కెసీఆర్ కు అభినందనలు తెలియజేసే విధంగా ఈ కటౌట్లు ఏర్పాటు చేయడం జరిగింది.

కొడాలి నాని ఆంధ్రాలో కేసీఆర్ పార్టీకి పెద్దగా ప్రజా ఆదరణ ఉండదు అని తెలిపిన రెండు రోజుల తర్వాత గుడివాడలో ఈ విధంగా ఈ కట్ అవుట్ల పై వైసీపీ పార్టీకి చెందిన నాయకుల ఫోటోలు పెట్టి పట్టణ ప్రధాన సెంటర్స్ లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై రాజకీయ వర్గాలు చర్చకు దారితీసింది.కులం పై ఉన్న అభిమానంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలా.

లేక గుడివాడ పట్టణంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ని తీసుకువచ్చి వెలమలు అందరూ ఏకతాటిపై నిలబడి స్థానికంగా ఉన్న వెలమ కులస్తుల బలం నిరూపించుకోవాలనే ప్రయత్నమా అంటూ గుడివాడ వాసులు చర్చిస్తున్నారు.కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు మరొక ముందే ఈ విధంగా కటౌట్లు ఏర్పాటు చేయడంపై రాజకీయ చర్చ మొదలైంది.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు